Monday, November 17, 2025
Homeనేరాలు-ఘోరాలుBhimadevarapalli: పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

Bhimadevarapalli: పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

పక్కా సమాచారంతో దాడి

భీమదేవరపల్లి మండలం కొప్పూరు శివారులో పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, ముల్కనూర్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ముల్కనూర్ ఎస్సై సాయిబాబు కథనం మేరకు.. పేకాట ఆడుతున్న పరకాలకు చెందిన ఎస్కే బాబా, మడికొండకు చెందిన నూనె చంద్రయ్య, జనగాంకు చెందిన కొడమంచి ఉప్పలయ్య, ముల్కనూర్ బుడగ జంగాల కాలనీకు చెందిన చిత్రాల సమ్మయ్య, రుద్రాక్ష కుమార్ లను అరెస్టు చేసి, వారి నుంచి 2,18,000 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, ఒక బైకు, ప్లే కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ముల్కనూర్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad