మెదక్ జిల్లాలో ఓ వింత ముఠాను పోలీసులు అరెస్టు చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెల్ టవర్ మెటీరియల్ చోరీ చేసే పెద్ద గ్యాంగును మెదక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ మాట్లాడుతూ.. గత సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి వారంలో నేరస్తులు రామంతపూర్ శివాల్లోని సెల్ టవర్లకు సంబంధించిన మెటీరియల్స్ దొంగతనాలకు పాల్పడి అంతటితో ఆగకుండా, ఈ నేరస్తులు జిల్లాలలో వరుసగా సెల్ టవర్లకు సంబంధించిన మెటీరియల్స్ దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసులు వివరించారు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని జిల్లా సిబ్బందిని, జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎస్ మహేందర్, డీఎస్పీ తూప్రాన్ యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందుతులను పట్డుకున్నారు.
జల్సాల కోసమే..
ప్రధాన నేరస్థుడు మాసిని మహేష్ వెంకంపల్లి గ్రామం కామారెడ్డి జిల్లాకు చెందిన వాడు, ఇతను జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో 11 మందితో ఒక ముఠాగా ఏర్పడి, సెల్ టవర్లకు సంబంధించిన మెటీరియల్స్ చోరీకి పాల్పడేవారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వీరందరినీ రిమాండ్ కు తరలించారు. మిగతా నలుగురు పరారీలో ఉండగా, ఈ బృందంపై మొత్తం 26 పోలీస్ స్టేషన్ పరిధుల్లో 24 కేసులు నమోదయ్యాయి. వీరి నుండి 6,75,000 రూపాయలు ఇప్పటికే పోలీసులు రీకవరీ చేశారు. 25 లక్షల రూపాయలకు విలువైన సొమ్మును వీరు ఇప్పటికే చోరీ చేసి ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. సోల్ టవర్ మెటీరియల్ దొంగలను పట్టుకున్న పోలీసులను జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ అభినందించి, సిబ్బందికి రివార్డులు ఇచ్చారు.