మంత్రాలయం మండలం చెట్నిహాల్లి గ్రామంలో నెల రోజులుగా తాగునీటి సమస్య మొదలైంది. పంచాయతీలలో నీటి వనరులు తగ్గిపోవడంతో సమస్య జటిలమైంది. కొన్ని వీధులకు నీరు పుష్కలంగా వస్తే మిగిలిన వాడల్లో నీరే రావడం లేదు. దీంతో నీటికోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిష్కరించాల్సిన అధికారులు , ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. చుట్టుపక్కల ఉన్న పొలాల బోర్ల దగ్గరకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. 1000 చొప్పున చెల్లించి నీటి ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నారు. తాగునీటి కోసం ఫిల్టర్ బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే నెల రోజులు గడిచినా సమస్య పరిష్కారం కాకపోవడంతో వేసవి కాలంలో మొత్తం నీరులేక ఎలా గడపాలో అర్థంకాక జనం ఆందోళన చెందుతున్నారు.
Mantralayam: చెట్నిహల్లీలో నెల రోజులుగా తాగునీటి సమస్య
వెయ్యి రూపాయలకు నీటి ట్యాంక్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES