Saturday, July 27, 2024
Homeనేరాలు-ఘోరాలుEmmiganuru: ఊరికి దగ్గరలో స్మశానం ఉంటే అరిష్టమట

Emmiganuru: ఊరికి దగ్గరలో స్మశానం ఉంటే అరిష్టమట

హిందూ స్మశాన వాటిక కమిటీ నాయకుల ఫిర్యాదు

ఊరికి దగ్గరలో స్మశానం ఉంటే అరిష్టం అని స్మశాన స్థలం కబ్జా చేసిన పెద్ద మనుషులు చెబుతున్నారని హిందూ స్మశాన వాటిక కమిటీ నాయకులు వీజీఅర్ కొండయ్య, వడ్డే బజారప్ప, బతకన్న, మాధవులు, పాండు రంగస్వామి, గణేష్, లచ్చన్న, హలహార్వి యాపిలయ్య, నామాల శ్రీరాములు, నాగరాజు , బూదురు నాగేష్, రామస్వామి, గాజుల నాగేశ్వర రావు, బీఎల్ నారాయణ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కబ్జా రాయళ్ళ ప్రయత్నాలను హిందూ బిసి స్మశాన వాటిక పరిరక్షణ కమిటీ నాయకులు అడ్డుకొని మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాం. కమిషనర్ ఆదేశాలతో సర్వేయర్ స్మశాన వాటిక భూమిని సర్వే చేయించి సరిహద్దు రాళ్ళను పాతించారు. ఆ రాళ్లకు పెయింట్ వేశామని దీంతో కబ్జా రాయళ్ళ ప్రయత్నం వికటించింది.

- Advertisement -

గుడి-గోశాల పేరుతో..

ఎలాగైనా భూమిని స్వాధీనం చేసుకోవాలనే కుట్రతో భక్తుల ముసుగులో సాక్షాత్తు ఆ మహాశివుడు కొలవై ఉండే ఆ స్మశాన వాటికలో గుడి, గోశాలను కట్టిస్తామని బీసీ సంఘం నాయకుల వద్దకు వచ్చి గుడి-గోశాల ప్రతిపాదన చేశారు. దీనిని తిరస్కరించామన్నారు. మరోదారిలో దానిని సాధించుటకు ఆ భూమి స్మశానానికి సంబంధించినది కాదని పేర్కొంటూ ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసు వారు కూడా సరైన ధ్రువపత్రాలను తీసుకొని స్టేషన్ కు వచ్చి తమని కలవమని బీసీ సంఘాల నాయకులకు కబురు పంపారు. సోమవారం 22 బిసి కుల సంఘాల ప్రతినిధులతో కూడిన హిందూ బీసీ స్మశాన వాటిక పరిరక్షణ కమిటీ నాయకులు పట్టణ పోలీసు అధికారిని కలిసి హిందూ బీసీ స్మశాన వాటికకు సంబంధించిన ధ్రువపత్రాలను అందజేసి, ఆ స్మశాన వాటికకు సంబంధించిన నిజనిజాలను వారికి తెలియజేసి, కబ్జా రాయళ్ళ కుటిల భాగోతాన్ని వివరించాం. ఈ కబ్జారాయళ్ళు హిందూ బిసి స్మశాన వాటిక భూమిని కబ్జా చేయడానికి ఏ రూపంలో వచ్చినా సమాధానం ఇస్తాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News