Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: భూకబ్జాకు పాల్పడిన చీటీ రామారావు, రాములు అరెస్ట్

Karimnagar: భూకబ్జాకు పాల్పడిన చీటీ రామారావు, రాములు అరెస్ట్

రాములు, రామారావ్ రిమాండ్ కు తరలింపు

కరీంనగర్ లోని భగత్ నగర్ కి చెందిన కొత్త రాజిరెడ్డి, తండ్రి భాగిరెడ్డి వయసు 63, అతను మున్సిపల్ పర్మిషన్ ద్వారా ఇంటి నిర్మాణము చేస్తుండగా హైదరాబాద్ నల్లకుంట, ప్రస్తుత నివాసం గంగాధరకు చెందిన చీటీ రామారావు కరీంనగర్ 12వ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ తోట రాములు కలిసి ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారని కొత్త రాజి రెడ్డి గత నెల 20 వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ ఎస్సై ఎస్.ఐ. స్వామి కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో పై ఇద్దరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా రాజి రెడ్డి ఇంటి స్థలాన్ని ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో హద్దులు మార్చి తప్పుడు దృవపత్రాలు సృష్టించారని విచారణలో తేలింది. ఈ విచారణ కరీంనగర్ కమీషనరేట్ లో నూతనంగా ఏర్పాటైన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సహాయంతో వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. దానిలో భాగంగా పూర్తిస్థాయి విచారణకై పోలీసు బృందం హైదరాబాద్, విశాఖపట్నం సైతం వెళ్లి కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించామని తెలిపారు.

- Advertisement -

ఇప్పటివరకు సేకరించినటువంటి ఆధారాల మేరకు పై వ్యక్తులు అక్రమంగా భూకబ్జాకు పాల్పడ్డారని నిర్ధారించిన కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జె.సరిలాల్ పై వ్యక్తులను (Cr. No. 491/2023 u/s 120-B , 447, 427, 465, 467, 468, 471 r/w 34 IPC) అరెస్ట్ చేసి కరీంనగర్ సెంకండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ లో హాజరు పరచగా గౌరవ న్యాయమూర్తి కేసుపూర్వ పరాలు పరశీలించి ముద్దాయిలకు ఈ నెల 31 వ తేది వరకు రిమాండ్ విధించారు. ఇట్టి కేసుపై విచారణ ఇంకా కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News