Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: రేకుర్తిలో అక్రమ కట్టడాలు ఆగేనా?

Karimnagar: రేకుర్తిలో అక్రమ కట్టడాలు ఆగేనా?

ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికార యంత్రాంగం

కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్న స్థలానికి పర్మిషన్, కరంటు కావాలని కాళ్లు అరిగేలా తిరిగినా అది లేదు ఇది లేదని చెప్పులు అరిగేలా తిప్పుకునే అధికార యంత్రాంగం మన కళ్లెదుటే బహుళ అంతస్తులు నిర్మిస్తున్న అధికారులు మాత్రం కళ్ళు లేని కబోదిలా చూస్తున్న వైనం.

- Advertisement -

వివరాల్లోకి వెళితే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి 18వ డివిజన్ లో కరీంనగర్- జగిత్యాల్ మెయిన్ రోడ్డు నుండి 10 అడుగుల దూరంలో ఎస్ ఆర్ ఎస్ పి డి 94 కాల్వకు ఆనుకుని ఉన్న ఎస్ ఆర్ ఎస్పీ భూమిలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు దౌర్జన్యంగా ఓ రాజకీయ నాయకుడి అండదండలతోటి బహుళ అంతస్తును నిర్మిస్తున్నా అధికారులు మాత్రం కళ్ళులేని కబోదిలా చూస్తూ ఉండడాన్ని చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. అక్రమ ఇల్లు నిర్మిస్తున్నారని పక్కింటి వారు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు సంబంధిత అధికారులంటే ఇక్కడి పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. అక్రమ ఇంటి నిర్మాణాన్ని ఆపివేయాలని ఇరిగేషన్ అధికారులు ఎన్నిసార్లు ఆ ఇంటికి నోటీసులు ఇచ్చినా, సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా రాజకీయ అండదండలతో ఆ ఉపాధ్యాయుడు తన చేతివాటాన్ని చూపెడుతూ నాకు ఎవడు అడ్డు లేడు అని అక్రమ ఇంటిని నిర్మిస్తూనే ఉన్నాడు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి వేసిన కమిటీ ఇలాంటి అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపుతారని కరీంనగర్ జిల్లా ప్రజలు ఆశతో వేచిచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News