రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గ్రామాలలో డిసెంబర్ 31 సందర్బంగా రోడ్డుపై విచ్చలవిడిగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై సుధాకర్ హెచ్చరించారు. నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. మద్యం తాగి విచ్చలవిడిగా వ్యవహరించకూడదని, ఇతరులతో గొడవ పెట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కేసులు పెడతామని హెచ్చరించారు.
