శ్రీశైలం(Srisailam)లో అపశృతి చోటుచేసుకుంది. పాతాళగంగలో స్నానం చేయడానికి దిగి తండ్రి కొడుకు మృతి చెందారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చి ఇలా మృతి చెందటం చాలా బాధకరమని పలువురు వాపోతున్నారు. ఆలయాధికారులు ఎక్కడికక్కడ అన్ని భద్రతా ఏర్పాట్లు చేసిన ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవటం విస్మయానికి గురి చేస్తుంది. భక్తులు స్నానాలు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు ఆలయ అధికారులు.
చిన్న పిల్లలతో స్నానాలు చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సినవసరం ఉందన్నారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటేనే ఆలయ అధికారులను కలిసి చెప్పుకోవాలని సూచిస్తున్నారు. వ్యక్తిగతంగా తగు జాగ్రత్తలు తీసుకోని స్వామివారిని దర్శించుకుని క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరుతున్నారు.
ఏడవ రోజు భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జున స్వామి గజ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుండే అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి అభిషేకం, మహానివేదన, వేద పారాయణం, హోమాలు, ప్రత్యేక సుప్రభాతం, అలంకార సేవలు ఘనంగా సాగాయి.
Srisailam: శ్రీశైలంలో అపశృతి..
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES