రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో గతంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని, భహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిని తంగళ్ళపల్లి పోలీసులు సిరిసిల్ల మేజస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చగా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన నలుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున వెయ్యి రూపాయల జరిమానా విధించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపిన 23 మందిని సిరిసిల్ల మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా ఆరుగురికి 2000 చొప్పున, 17 మందికి వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధించినట్టు తంగళ్ళపల్లి ఎస్ఐ డి.సుధాకర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మార్చి నెలలో నిర్వహించబోయే మెగా లోక్ అదాలత్ లో కక్షిదారులు పెద్ద ఎత్తున హాజరై తమ కేసులని రాజీ దిశగా పరిష్కరించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.