హైదరాబాద్‌లోని ఆదాయపు పన్ను శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా(IT Officer) పనిచేస్తున్న జయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. సికింద్రాబాద్‌లోని సీజీవో టవర్స్ ఎనిమిదవ అంతస్తు నుంచి కిందకు దూకి ఆమె బలవన్మరణం చెందారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమిక విచారణలో భావిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై తెలియాల్సి ఉంది.
IT Officer: హైదరాబాద్‌లో ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మి ఆత్మహత్య
సంబంధిత వార్తలు | RELATED ARTICLES