తెలంగాణ వ్యాప్తంగా బుధువారం ఉదయం నుంచీ బాల వికాస్ సోషల్ సర్వీస్ సొసైటీ, బాల థెరిస్సా సొసైటీల్లో తనిఖీలు ఐటీ సోదాలు కొనసాగాయి. సొసైటీ ఫౌండర్ సింగిరెడ్డి శౌరెడ్డికి చెందిన ఆస్తులపై ఐటీ ఆరా తీస్తోంది. విదేశాల నుంచి వచ్చిన 412 కోట్ల లావాదేవీలపై తనిఖీలు చేపట్టారు. సొసైటీ పేరు చెప్పి విదేశాల నుంచి నిధులు రాబట్టిన శౌరెడ్డి, విదేశీ నిధులన్నీ సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. శౌరెడ్డి, భార్య సునీతా రెడ్డి పేర్లపై భారీగా ఆస్తులు కొనుగోలు చేయటంతో పాటు సొసైటీలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల పేర్లపైనా ఆస్తులు కొనుగోలు చేసి, నిధుల మళ్లింపు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆస్తుల కొనుగోలు వ్యవహారాలపై ఐటీ సోదాలు సాగాయి. వరంగల్, హైదరాబాద్‌తో కలిపి మొత్తం 40 చోట్ల ఐటీ తనిఖీలు జరిగాయి.
అయితే ఇలా బాల వికాస లాంటి సేవా సంస్థలపై ఐటీ దాడులు అమానుషం అంటూ మంత్రి ఎర్రబెల్లి అన్నారు. బాల వికాస పై ఐటీ దాడులను ఖండించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..గత 30 ఏళ్లుగా దేశ, విదేశాల నుంచి నిధులు సమకూరుస్తూ, నిస్వార్థ ప్రజా సేవ చేస్తున్న సంస్థ బాల వికాస పై దాడులు బాధాకరమన్నారు. బాల వికాస క్రిస్టియన్ మిషనరీ సంస్థ అవడం వల్లే ఈ ఐటీ దాడులు సాగుతున్నట్టు,
ఈ ఐటి దాడులు కక్ష్యసాధింపు చర్యలేనని ఆయన అన్నారు. లౌకిక, ప్రజా స్వామికి దేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతోందని ఎర్రబెల్లి ఆరోపించారు. ఎందరో ప్రముఖులు ప్రశంసించిన బాల వికాస సంస్థ పై ఐటీ దాడులు అవమానకరమన్నారు.