Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుJammikunta: లింగ నిర్ధారణ పరీక్షలు ఆపై అబార్షన్ !

Jammikunta: లింగ నిర్ధారణ పరీక్షలు ఆపై అబార్షన్ !

లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రభుత్వం ఎన్ని ఆదేశాలు జారీ చేసిన కఠిన నిబంధనలు అమలు చేస్తున్న కొంతమంది వైద్యులలో మార్పు రావడం లేదు. పురుడు పోసుకోని పసి ప్రాయాలను గర్భంలోనే చిదిమేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే సదరు వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఆసుపత్రిని సీజ్ చేస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ధనార్జనే ధ్యేయంగా తమ ఇష్టానుసారం లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం పరిపాటిగా మారింది. తమకు ఉన్నతాధికారుల అండదండలు, రాజకీయ పలుకుబడి ఉందన్న నమ్మకమో తెలియదు కానీ లింగ నిర్ధారణ పరీక్షలు యదేచ్ఛగా నిర్వహిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలపై పలుమార్లు జమ్మికుంటలోని శ్రీ విజయ సాయి ఆస్పత్రిపై ఆరోపణలు వచ్చినప్పటికీ వారి తీరు మారకపోవడం విస్మయాన్ని కలిగిస్తున్న అంశం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారిణి లలితా దేవి ఆధ్వర్యంలో వైద్యాధికారుల బృందం జమ్మికుంట పట్టణంలోని పలు ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షల పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా విజయ సాయి ఆస్పత్రికి తనిఖీ బృందం వెళ్లిన సమయంలో ఒక వివాహితకు ఆస్పత్రి వైద్యురాలు అబార్షన్ చేసిన విషయాన్ని గుర్తించారు. బాధితురాల నుండి వివరాలు సేకరించగా తాను శుక్రవారం లింగ నిర్ధారణ పరీక్షలు నిమిత్తం రాగా ఆడపిల్ల అని తేలడంతో సోమవారం ఉదయం ఆసుపత్రి వైద్యాధికారిని అబార్షన్ చేసినట్లు తెలిపారు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించిన జిల్లా వైద్యాధికారులు వారి ఆదేశాల మేరకు సదరు ఆస్పత్రిని సీజ్ చేయించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆసుపత్రిలో పలువురు ఇన్ పేషెంట్లు ఉండడంతో ఆసుపత్రి సీజ్ చేసేందుకు వారం రోజుల గడివిచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే గదిని మాత్రం తక్షణమే సీజ్ చేశారు. ఆసుపత్రి నిర్వాహకులైన ఇద్దరు వైద్యుల పై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక పంపించనున్నట్లు జిల్లా వైద్యాధికారిని లలితా దేవి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News