Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుJammikunta: దొంగతనం కేసును 48 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

Jammikunta: దొంగతనం కేసును 48 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

ఖాకీలకు అభినందన..

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుర్గా కాలనీలో ఒక ప్రైవేటు కాంట్రాక్టర్ గోదాంలో నిల్వ ఉంచిన రైల్వే శాఖకు చెందిన సుమారు నాలుగున్నర లక్షల విలువ చేసే కాపర్ వైర్ దొంగతనం కేసును జమ్మికుంట పోలీసులు చాకచక్యంగా 48 గంటల్లోనే ఛేదించారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపర్ వైర్ దొంగతనానికి సంబంధించి సీఐ వరంగంటి రవి తెలిపిన వివరాల ప్రకారం… బండావతి సందీప్ అనే వ్యక్తి మరో వ్యక్తి బాలుతో కలిసి అక్టోబర్ 29న గోదాం సెట్టర్ తాళాలు పగల కొట్టి సుమారు నాలుగున్నర లక్షల విలువ చేసే కాపర్ వైర్ ను (500 కేజీల) దొంగతనం చేసి కీసర మండలం నాగారం గ్రామానికి చెందిన హేమ కనకయ్య అనే వ్యక్తికి విక్రయించినట్లు తెలిపారు. సంఘటనపై గోడౌన్ ఇంచార్జ్ జగదీష్ దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపి సీసీ కెమెరాలు ఆధారంగా దొంగలను పట్టుకున్నట్లు సిఐ తెలిపారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను చాకచక్యంగా పట్టుకొని కేసును ఛేదించిన జమ్మికుంట ఎస్ఐ ఆరోగ్యం, హెడ్ కానిస్టేబుల్ మోహన్, సదయ్య, సంపత్ లతోపాటు కానిస్టేబుల్ వేణు, సిబ్బందిని సిఐ అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News