Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుWoman Stabs Husband: ఫోన్, డబ్బులు ఇవ్వడం లేదని భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

Woman Stabs Husband: ఫోన్, డబ్బులు ఇవ్వడం లేదని భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

Woman Stabs Husband To Death Over Money, Phone: ఓ చిన్న గొడవ ఎంతటి దారుణానికి దారి తీసిందో జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో వెలుగు చూసిన ఘటన నిరూపించింది. కేవలం డబ్బు, మొబైల్ ఫోన్ విషయంలో జరిగిన భార్యాభర్తల గొడవ, భర్త ప్రాణాలు తీయడంతో విషాదంగా మారింది. బీహార్‌కు చెందిన ఈ కుటుంబంలో జరిగిన హత్య ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

- Advertisement -

ALSO READ: Crime case: చికెన్‌ ముక్కల విషయంలో భార్యను చంపిన భర్త.. 6ఏళ్ల తర్వాత బయటపడ్డ అసలు విషయం!

మిహిజామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పైప్‌లైన్ ఏరియాలో ఆదివారం రాత్రి ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బీహార్ నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడిన మహావీర్ యాదవ్ (40) తన భార్య కాజల్ దేవి (Kajal Devi)తో కలిసి నివసిస్తున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆదివారం రాత్రి కాజల్ దేవి తన భర్త మహావీర్‌ను కొత్త ఫోన్ కొనివ్వాలని, డబ్బు కావాలని పట్టుబట్టింది. ఆ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో కాజల్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని, క్షణికావేశంలో మహావీర్‌ను విచక్షణారహితంగా పొడిచి చంపింది.

ALSO READ: Woman Half-Burnt: సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం.. MLA మేనల్లుడి దాష్టీకం? నలుగురు అరెస్ట్!

నేరం అంగీకరించిన నిందితురాలు

ఈ ఘటనపై సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) వికాష్ మాట్లాడుతూ, “డబ్బు, మొబైల్ ఫోన్ విషయంలో జరిగిన గొడవే హత్యకు కారణమని విచారణలో తేలింది. నిందితురాలు కాజల్ దేవిని తక్షణమే అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నాం” అని తెలిపారు.

ALSO READ: Student Suicide: IIT ఖరగ్‌పూర్‌లో కలకలం.. పీహెచ్‌డీ విద్యార్థి అనుమానస్పద మృతి.. ఏడాదిలో ఐదో ఘటన

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, మిహిజామ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితురాలిపై కొత్త చట్టమైన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103 కింద కేసు నమోదు చేశారు.

సాధారణ కుటుంబ కలహాలు ఇంతటి దారుణమైన హత్యకు దారితీయడం స్థానిక ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న విషయాలకే ప్రాణాలు తీయడం పట్ల పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ హత్య వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: Man Strangles Partner: సహజీవనం చేస్తున్న యువతిపై అనుమానం.. చంపి, బ్యాగులో కుక్కి అనంతరం సెల్ఫీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad