ప్రభుత్వ నిషేధిత గుట్కాలను అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కల్వకుర్తి డిఎస్పి వెంకటేశ్వర్లు అన్నారు. డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఎస్పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు పట్టణంలోని సీఐ నాగార్జున ఆధ్వర్యంలో ఎస్సై మాధవరెడ్డి వాహనాల తనిఖీ నిర్వహించగా ఏపీ 22 వై 63 10 ఆటో డ్రైవర్ పోలీసులను చూసి ఆటోను వెనక్కి తిప్పి పారిపోతుండగా పోలీసులు ఆటోను పట్టుకొని ఆటో డ్రైవర్ నరసింహను అదుపులోకి తీసుకొని, ఆటోకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆటోలో ఏమున్నాయని అడగగా పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానంతో ఆటోలోని వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించగా గుట్కాలకు సంబంధించిన సంచులు ఉన్నాయి.
వాటికి సంబంధించిన బిల్లులు చూపించాలని అడగడంతో బిల్లులు చూపించలేదు. దాంతో పోలీసులు నరసింహను విచారించగా ఆమనగల్లు పట్టణానికి చెందిన క్రాంతి కుమార్ కు సంబంధించిన నిషేధిత గుట్కా బస్తాలను కల్వకుర్తిలోని దుకాణాలలో ఇవ్వడానికి వస్తున్నానని పోలీసులకు తెలిపారు. ఆటోలో రెండు సాగర్ సంచులు, మూడు విమల్ సంచులు, నాలుగు ఆర్ఆర్ నవరతన్ పాన్ మసాలా, ప్యాకెట్స్ లభించాయి. వాటి విలువ సుమారు రెండు లక్షలు ఉంటుందని తెలిపారు. ఆటోలోని గుట్కా ప్యాకెట్లను స్వాధీనం పరుచుకొని అతనిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిషేధిత గుట్కా, మత్తు పదార్థాలను ఎవరైనా విక్రయించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు. రెండు ఎస్ ఐ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.