Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుKangti: పురుగుల అన్నంతో విద్యార్థులు పరేషాన్

Kangti: పురుగుల అన్నంతో విద్యార్థులు పరేషాన్

ఇలాంటి భోజనాన్ని మీరు మా పిల్లలకు పెడతారా?

తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా విద్యా రంగంపైన అత్యధిక ఆసక్తి చూపించి విద్యార్థులు బాగుపడే విధంగా విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులతో సహా అనేక సహాయ సహకారాలు సదుపాయాలు అందిస్తున్నప్పటికీ కింది స్థాయి అధికారులు వాటిని నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థులకు సరైన న్యాయమందించడంలో విఫలం అవుతున్నారు. విద్యార్థులకు కూడా అనేక పోషక పదార్థాలతో సహా మధ్యాహ్న భోజనం పథకం కింద సన్న బియ్యం అందించినప్పటికీ కింది స్థాయి అధికారి పాఠశాల యాజమాన్యం వాటిని పర్యవేక్షించకుండా విద్యార్థులకు వాటిని అందిస్తారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగ్టి మండల పరిధిలో చాప్టకే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం సిద్ధం చేస్తుండగా ఆ దృశ్యం స్థానికుల కంటపడింది, రోజువారీగా వంట కార్మికులు విద్యార్థులకు భోజనం వండడానికి బియ్యం తియ్యగా ఆ బియ్య ముక్కిపోయినవిగా, ఆ బియ్యంలో పురుగులు ఉండడం స్థానికులు చూసి నివ్వెర పోయారు, ఈ పురుగుల బియ్యం ముక్కిపోయిన బియ్యాన్ని విద్యార్థులకు వండుమని ఎవరు చెప్పారు అని స్థానికుల ప్రశ్నించరు? ఇలాంటి భోజనం మా పిల్లలకు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు?

- Advertisement -

వెంటనే వంట కార్మికుల సమాధానం ఇస్తూ ఈ విషయం మాకు ఏమీ తెలియదు మేము హెచ్ఎం చెప్పినట్టుగా మేము చేస్తున్నామని చెప్పారు, మా చేతిలో ఏముంది పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎలాంటి బియ్యం ఇస్తే అలాంటి బియ్యము వండడానికి మేము సిద్ధంగా ఉన్నామని కార్మికులు అన్నారు. ఈ విషయమై స్థానికులు పాఠశాల యజమాన్యంపై కార్మికులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి భోజనం తినడం వల్ల మా పిల్లలకి ఏమైనా అయితే బాధ్యులు ఎవరని స్థానికులు ప్రశ్నించారు? ఈ విషయంలో పైఅధికారులు పాఠశాల యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News