Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: డ్రోన్ల నిషేధం

Karimnagar: డ్రోన్ల నిషేధం

ఈనెల 31 వరకు అమల్లో నిషేధం

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో భద్రత కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ ల వినియోగాన్ని నిషేదించినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేదాజ్ఞలు ఈనెల 31 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఈ సాంకేతిక పరికరాలను ఈ మధ్యకాలంలో వివాహాది శుభకార్యాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా వినియోగిస్తున్నారని ఆయన తెలిపారు. ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు వీటిని వినియోగించే అవకాశాలుండటంతో సదరు సాంకేతిక పరికరాల వినియోగాన్ని నిషేదించినట్టు ఆయన వివరించారు. ఎవరైనా వినియోగించదలచినట్లయితే సంబంధిత పోలీసుల అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపిసి సెక్షన్ 188 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు

కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల దృష్ట్యా నియమ నిబంధనలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సంబంధిత ఎసిపిల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిర్వహించకూడదని చెప్పారు.

ఇతరులను గాయపరిచే విధంగా ఉండే వస్తువులు, మారణాయుధాలను ధరించి సంచరించకూడదు. రోడ్లు, ప్రజలకు ఉపయోగపడే ఇతర స్థలాల్లో జనాన్ని సమీకరించకూడదు. పేన పేర్కొన్న ప్రాంతాలలో మ్యూజిక్ లు, పాటలు, ప్రసంగాలు చేయవద్దని కోరారు. ఈ ఉత్తర్వులు ఈనెల 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News