Saturday, July 27, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై కఠిన చర్యలు

Karimnagar: తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై కఠిన చర్యలు

ఫిర్యాదు చేసిన బాధితులు

పైసా పైసా కూడపెట్టుకుని, తమకు ఉన్నంతలో భూమి కొనుగోలు చేసుకున్న వారికి ఇంటి నిర్మాణం చేపట్టడంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కొంత విరామం తీసుకున్నారు. ఇంతలో ఖాళీగా కనిపించిన స్థలంపై కన్నేసిన భూ కబ్జాదారులు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆ భూమి తమదేనని అనడంతో బాధితులు జిల్లా స్థాయి అధికారులను ఆశ్రయించిన ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

- Advertisement -

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి లో సర్వేనెంబర్ 67/A లో వరుకోలు సంధ్య కు చెందిన 254.00 చ.గ.లు స్థలాన్ని హుజురాబాద్ కు చెందిన కొత్తపల్లి విజయలక్ష్మి 2017 సంవత్సరంలో కొనుగోలు చేసి డాక్యుమెంట్ నెం.4375/2017, తేది : 22.11.2017 రోజున గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ సమయంలో రేకుర్తి గ్రామపంచాయతీ గా ఉండడంతో రేకుర్తి గ్రామపంచాయతీ నుంచి ఇంటి నిర్మాణం కోసం తేది : 30.07.2018 రోజున అనుమతి తీసుకుని అనివార్య కారణాల వల్ల ఇంటి నిర్మాణం చేసుకోలేకపోయారు. దీంతో స్థలం ఖాళీగా ఉన్న విషయాన్ని గ్రహించిన చిదురు భావన సదరు ఖాళీ స్థలములో రేకుల షెడ్డు ఉన్నట్లుగా తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించుకొని కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా ఇంటి నెంబర్ 3-67/A/1 పొంది విజయలక్ష్మికి చెందిన భూమిని యముండ్ల మల్లేష్ పేరున డాక్యుమెంట్ నెం.3312/2022, తేది: 9.06. 2022 రోజున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

సరైన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించకుండానే గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు సైతం రిజిస్టేషన్ చేశారు. ప్రస్తుతం విజయలక్ష్మి తన భూమిలో ఇంటి నిర్మాణం చేపడుతుండగా ఆ భూమి తనదేనంటూ నకిలీ పత్రాలు సృష్టించిన భూకాబ్జాదారులు ఇంటి నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారని విజయలక్ష్మి జిల్లా కలెక్టర్, కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించిన భావనతో పాటు పత్రాలు పరిశీలించకుండానే రిజిస్టేషన్ చేసిన గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులపై తగు చర్యలు తీసుకుంటూ యముండ్ల మల్లేష్ డాక్యుమెంట్ నెం. 3312/2022 సు రద్దు చేయాలని జిల్లా రిజిస్టర్ కు సైతం ఫిర్యాదు చేసినట్లు విజయలక్ష్మి తెలిపారు.


భూ కబ్జాదారులపై ప్రస్తుత సిపి అభిషేక్ మహంతి ఉక్కు పాదం మోపుతున్న ఇంకా కొంతమంది భూకబ్జాదారులలో మార్పు రాకపోవడం విష్మయాన్ని కలిగిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News