Sunday, September 8, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: తప్పుడు ధృవీకరణ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్

Karimnagar: తప్పుడు ధృవీకరణ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్

గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమా లేన్నో

కరీంనగర్ నగరం రోజురోజుకు మహానగరంగా మారుతుండడంతో సమీప గ్రామాల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి తోడు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగరానికి సమీపంలోని గ్రామాలను నగరంలో కలపడంతో అదే మంచి అవకాశంగా భావించిన పలువురు భూ అక్రమార్కులు గతంలో ఇంటి అనుమతులు పొందినట్లు తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి కోట్లు విలువ చేసే భూములను కాజేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో మామూళ్లు ముట్ట చెప్పి సరియైన ధ్రువీకరణ పత్రాలు లేకుండానే తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం విష్మయాన్ని కలిగిస్తుంది. కోట్లలో విలువ చేసే భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతుండడంతో బాధితులు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

- Advertisement -

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…
కరీంనగర్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న రేకుర్తి సర్వే నెం. 106లో దుర్గం శ్రీనివాస్ కు 0-20 గుంటల భూమి తన తాతల నుంచి వారసత్వంగా సంక్రమించింది. కానీ పాత శేఖర్, కోగిలంచ సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం రేకుర్తిలో 20గుంటల భూమిని 10 ప్లాట్లుగా మార్చుతూ తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి పర్మిషన్లు పొందారు. అట్టి పర్మిషన్లు కూడా 24 నెలల గడువు ఉంటుంది, కానీ అట్టి గడువు తేది ముగిసినప్పటికి 30-01-2021 రోజున 1113/2021 ద్వారా అక్రమంగా తప్పుడు ధృవీకరణపత్రాలతో ఎస్ఆర్ ఇన్ఫ్రా & డెవలపర్స్ తుమ్మనపల్లి శ్రీనివాస్ రావుకు సదరు ప్లాట్లను విక్రయించారు.

రశీదు నెం. 4992, తేది: 07-07-2018 రోజున రూ॥ 25,500/- గ్రామపంచాయతీకి ఇంటి పర్మిషన్ కోసం పన్ను చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. ప్రస్తుతం సదరు ప్లాట్ లలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న సదరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ తో పాటు, మున్సిపల్ కమిషనర్ కు,రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు బాధితుడు దుర్గం శ్రీనివాస్ తెలిపారు.

బాధితుడి ఫిర్యాదుపై అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూద్దాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News