Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: పోలీస్ స్టేషన్లలో రైటర్ల పాత్ర కీలకమైంది

Karimnagar: పోలీస్ స్టేషన్లలో రైటర్ల పాత్ర కీలకమైంది

పోలీస్ స్టేషన్లకు చెందిన రికార్డుల నిర్వహణ, వివిధ రకాల కేసుల వివరాల నమోదులో రైటర్స్ పాత్ర కీలకమైందని కరీంనగర్ అడిషనల్ డిసిపి పరిపాలన జి.చంద్రమోహన్ అన్నారు. పోలీస్ స్టేషన్లకు చెందిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. కమిషనరేట్ కేంద్రంలో వివిధ పోలీస్ స్టేషన్లు, సర్కిల్, ఏసిపి కార్యాలయాలకు చెందిన రైటర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ అడిషనల్ డిసిపి పరిపాలన జి. చంద్రమోహన్ మాట్లాడుతూ కేసుల వివరాల నమోదులో ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా పోలీస్ స్టేషన్ల రైటర్లు వివరాలను నమోదు చేయాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శ్రద్ధాసక్తులతో అవగాహన పెంపొందించుకోవాలన్నారు.

- Advertisement -

పెండింగ్ కేసులు పరిమిత సంఖ్య కన్నా తక్కువ ఉండేలా దర్యాప్తు చేసే అధికారులకు సహాయకులుగా వ్యవహరించాలని చెప్పారు. కేసుల వివరాలను శ్రద్ధాసక్తులతో పకడ్బందీగా నమోదు చేసినట్లయితే ఎలాంటి సందేహాలకు తావుండదని తెలిపారు. గుర్తింపు లభించేలా విధినిర్వహణ కొనసాగించాలని చెప్పారు. కేసుల వివరాల నమోదులో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలందించవచ్చని తెలిపారు. పోలీస్ స్టేషన్లలో క్రమపద్ధతిలో రికార్డుల నిర్వహణను కొనసాగించాలని, ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా ఎప్పటికప్పుడు కేసుల వివరాలను నమోదు చేయాలని చెప్పారు. వివిధ రకాల సమాచారాన్ని వేర్వేరుగా నిక్షిప్తం చేసినట్లయితే సులువుగా ఉంటుందని సూచించారు. కేసుల వివరాలు నమోదు చేయడంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. వివిధ రకాల పని విభాగాల ఏర్పాటుతో పోలీస్ స్టేషన్ల పనితీరు సులభతరంగా మారిందని చెప్పారు. ప్రజలకు సేవచేసేందుకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News