Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: ఉద్యోగాలని యువతను ముంచుతున్న ముఠా

Karimnagar: ఉద్యోగాలని యువతను ముంచుతున్న ముఠా

నిరుద్యోగులైన అమాయక యువతకు ఉద్యోగాల పేరిట గాలం వేసి వారి వద్ద నుండి లక్షల లక్షల రూపాయలు దండుకుంటూ ఆపై ముఖం చాటేసి, యువతను నిలువునా ముంచి, ఘరానా మోసానికి పాల్పడుతున్న ముఠాను కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందిన మందల భాస్కర్ పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గంగారపు మధుమూర్తి చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన బత్తిని వైకుంఠం మరియు మరో ఇద్దరితో కలిసి ఒక ముఠాగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగ యువకుల కు ఉద్యోగం ఇప్పిస్తానని వారి వద్ద లక్షలు లక్షలు వసూలు చేసుకుంటూ… ముఖం చాటేసి వారిని ముంచడం చేస్తున్నారు.

- Advertisement -

వీరి వల్ల నష్టపోయిన బాధితుడు …….ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ నటేష్….. నిందితుల ముఠాను అరెస్టు చేయుటకు వారి కదలికలపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకునుటకు ఒక ప్రత్యేక బృందాన్ని ఎస్సై రహీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందం నిందితుల కదలికలపై నిఘా ఉంచి వారిని ఈరోజు అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వారు తమ నేరాన్ని అంగీకరించడంతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నామని తెలియజేసినారు. వారి వద్ద నుండి 93 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులు కోర్టులో హాజరు పరిచి వీరు ఇంకా ఎంతమందిని మోసం చేశారో, ఎంత మంది వద్ద ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేసినారు అనే విషయంపై లోతుగా విచారణ చేసి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News