ఏటీఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. బ్యాంకుల్లో గంటల తరబడి క్యూలైన్లో నిలబడే బాధ తగ్గడం, అవసరమైనప్పుడు డబ్బులు డ్రా చేయడం జరుగుతుంది. దీనికి తగినట్లుగా బ్యాంకులు కూడా తగిన ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాయి కానీ, వాటి బాగోగులు పట్టించుకోవడం మానేశాయి. ఏటీఎంలకు రక్షణగా సెక్యూరిటీ గార్డులు ఉండాలి, కానీ అనేక చోట్ల సెక్యూరిటీ సిబ్బంది కనిపించటం లేదు. ఇదే అదునుగా చేసుకోని కొంత మంది మందుబాబులు విచ్చల విడిగా ఏటీఎంలనే అడ్డాలుగా మార్చేసుకుని మందు తాగుతున్నారు.
ఏటీఎం అంటే ఎనీ టైం మందు అన్న రీతిలో కీసర చౌరస్తాలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఎటిఎం పరిస్థితి. ఈ ఏటీఎంలో తాగిన మందు సీసాలు దర్శనమిచ్చాయి. ఈ ఏటీఎంలపై పోలీసుల నిఘా అంతంత మాత్రంగానే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా యాక్సిస్ బ్యాంక్ యజమాన్యం మందుబాబులకు అడ్డాగా మారకుండ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు.