Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుKothapalli: పెద్దపులి ఎక్కడుంది? పులి పిల్లలు తల్లి దగ్గరకు చేరేదెన్నడు ?

Kothapalli: పెద్దపులి ఎక్కడుంది? పులి పిల్లలు తల్లి దగ్గరకు చేరేదెన్నడు ?

పాపం.. పెద్ద పులి నుండి పులి పిల్లలు దూరమై నాలుగు రోజులు దాటింది. పిల్లి కూనలు తల్లి పులి దగ్గరికి చేరుతాయా, పెద్దపులి పులి పిల్లలను కలిసి ఉంటాయా, పెద్దపులి కోసం నాలుగు రోజులుగా శ్రమిస్తున్న అటవీ అధికారుల శ్రమ పలిస్తుందా, తల్లి బిడ్డలు కలుస్తాయా లేదా, పులి పిల్ల కూనలు జూకు చేరాల్సిందేనా అని ఎవరి నోట విన్నా ప్రస్తుతం ఆత్మకూరు పట్టణంలో ఇదే మాట వినబడుతోంది.

- Advertisement -

కొత్తపల్లి మండలం పెద్ద గుమ్ముడాపురం గ్రామంలో నాలుగు రోజుల కిందట తల్లి నుండి వేరైన పులి పిల్లలు లభ్యమయ్యాయి. అటవీ శాఖ యంత్రాంగమంతా పెద్దపులి కోసం అన్వేషిస్తూనే ఉన్నా, పెద్దపులి జడ తెలియడం లేదు. ఇటు పులి పిల్లలు తల్లి కోసం తపిస్తూనే ఉన్నాయి. అటు పెద్దపులి సైతం పిల్లల కోసం అన్వేషిస్తూనే ఉంటుంది. మరి పెద్దపులి పులి పిల్లలు కలుస్తాయా లేదా అనే ఉత్కంఠతో పట్టణవాసులు ఎదురు చూస్తున్నారు. అటవీ అధికారులు దాదాపు వందల సిబ్బందితో అడవిలో పెద్దపులి కోసం వెతుకుతూనే ఉన్నారు. తల్లి పులి ఆచూకీ లభించకపోతే, పులి పిల్లలను తిరుపతిలోని జూకు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. అన్ని విషయాలు తెలియాలంటే కొంతవరకు వేచి చూడాల్సిందే

శ్రీశైలం నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ఫీల్డ్ ఆధ్వర్యంలో పిల్లలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, కావలసిన ఆహారాన్ని అందిస్తున్నారు. తల్లి పులి కోసం మరొక రోజు ప్రయత్నించి, పెద్దపులి ఆచూకీ లభించకపోతే, పులి కోసం చేస్తున్న అన్వేషణ నిలిపివేస్తామని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News