Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుKurnool: కుప్పకూలుతున్న సర్వేయర్లు

Kurnool: కుప్పకూలుతున్న సర్వేయర్లు

ఒత్తిడితో అనారోగ్యం, మేం పనిచేయం: సర్వేయర్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేలో తీవ్ర పని ఒత్తిడి ఎదుర్కొంటున్నామని గ్రామ సర్వేయర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న గ్రామ సర్వేయర్లు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద విధులను బహిష్కరించి సామూహిక నిరసనను వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా గ్రామ సర్వేయర్లు మాట్లాడుతూ రీ సర్వేలో ప్రతిరోజు 100 ఎకరాలకు పైగా పై అధికారులు టార్గెట్ ఇస్తున్నారని దీనివల్ల మానసికంగా శారీరకంగా విధులు నిర్వహించలేకపోతున్నామని సెలవులు లేకుండా పనిచేయడం వల్ల అనారోగ్యం పాలై ఆసుపత్రిలో పాలవుతున్నామని వీరు వాపోతున్నారు.

, గ్రామస్థాయిలో పనిచేసే సర్వేయర్లకు సర్వేలో తగినంత సమయం ఇవ్వకపోవడంతో గ్రౌండ్ త్రూటింగ్, గ్రౌండ్ వాల్యుయేషన్ తప్పులు జరగడం వల్ల భూ యజమానులకు సమాధానం చెప్పలేకపోతున్నామని, డైలీ టార్గెట్స్ అంటూ పై అధికారులు వేధిస్తున్నారని వారు ఇచ్చిన టార్గెట్ ను అమలు చేయకపోతే మెమోల పేరుతో డిసిప్లరీ యాక్షన్ పేరుతో భయపెడుతున్నారని, ఎస్ఓపి సరిగా అమలు చేసే సమయం ఇవ్వకపోవడంతో గ్రౌండ్ త్రూటింగ్, గ్రౌండ్ వాల్యుయేషన్ దశలలో నోటీసులు ఇచ్చే టైం ఇవ్వడం లేదని అప్పీలు స్వీకరించే భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయపరమైన చట్టపరమైన సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

మండల, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న సర్వేయర్లకు ఎస్ఓపి ప్రకారం పని పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరి లాగిన్ పని చేయకపోయినా విలేజ్ సర్వేయర్స్ ను మాత్రమే బాధ్యులుగా చేస్తున్నారని ఇంత పని ఒత్తిడిలో పనికి సరిపడా రోవర్స్, స్టేషనరీ, సర్వేకు తగ్గ కాన్ఫిగరేషన్ గల ల్యాప్ టాప్ లు కూడా సమకూర్చడం లేదని, చిన్న గ్రామాలకు ఇచ్చిన టైమ్ నే పెద్ద గ్రామాలకు ఇచ్చి పని ఒత్తిడికి గురి చేస్తున్నారని వర్షాకాలంలో కురుస్తున్న వర్షాలకు పొలాల్లో రైతులు వారి పనుల్లో నిమగ్నమై ఉండి రీ సర్వేకు అందుబాటులో లేకపోవడం వల్ల పై అధికారులు ఇచ్చిన టార్గెట్ ను అందుకోలేకపోతున్నామని పలువురు సర్వేర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

సర్వే పనుల్లో పలువురు గ్రామ సర్వేయర్లు అనారోగ్యానికి గురయ్యారని వారిలో ప్రధానంగా క్రిష్ణగిరి మండలం కోయిలకొండలో విధులు నిర్వహిస్తున్న దను కృష్ణతీవ్రమైన పని ఒత్తిడితో అనారోగ్యం పాలయ్యాడని, కల్లూరు మండలం గోకులపాడు లో విధులు నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్ కడుపు నొప్పితో ఆసుపత్రిపాలయ్యాడని, క్రిష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామంలో మాధవ కృష్ణ అనే సర్వేయర్ తేనెటీగల బారినపడి కన్నుకు గాయమైందని వీటన్నింటికీ ప్రధాన కారణం భూముల రీ సర్వే ఒత్తిడేనని పై అధికారులు దృష్టి సారించి పని ఒత్తిడి తగ్గించాలని లేకపోతే జిల్లా వ్యాప్తంగా గ్రామ సర్వేయర్ల అందరం సామూహికంగా సెలవులపై వెళ్ళిపోతామని జిల్లా అధికారులను హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News