పగిడ్యాల మండలం లక్ష్మాపురం అంచె సమీపము నుండి కొద్ది దూరంలో ఉన్న రోడ్డు మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారినట్లు వాహనదారులు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. శనివారం లక్ష్మాపురం రోడ్డు మలుపుల వద్ద వాటర్ ట్యాంకర్ కలిగిన ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గతంలో కూడా ఈ మలుపుల వద్ద ఎంతోమంది ప్రమాదానికి గురయ్యారని రోడ్డు వెంట ఉన్న పొలాల రైతులు, వాహనదారులు తమ ఆవేదన వెల్లడించారు. ప్రమాదకరంగా మారిన ఈ మలుపుల వద్ద అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు వేయడం ద్వారా ప్రమాదలను అరికట్టవచ్చన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. మలుపుల వద్ద అనేక ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం లేదంటూ వాహనదారులు విమర్శిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మలుపుల వద్ద రోడ్డును వెడల్పు చేస్తూ, ఇరుపక్కల రక్షణ దిమ్మెలను, ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Lakshmapuram: ప్రమాదాలకు కేరాఫ్ గా లక్ష్మాపురం రోడ్డు
మలుపుల వద్ద అనేక ప్రమాదాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES