Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుKurnool Bus Accident: కర్నూలు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు.. బస్సు ఢీకొట్టకముందే శివశంకర్ మృతి!

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు.. బస్సు ఢీకొట్టకముందే శివశంకర్ మృతి!

latest updates kurnool bus accident: కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలుల ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. ద్విచక్ర వాహనంపై శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడిని పోలీసులు గుర్తించారు. శంకర్‌ స్నేహితుడైన ఎర్రిస్వామిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

విచారణలో విస్తుపోయే నిజాలు: ద్విచక్ర వాహనాన్ని కావేరీ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టలేదని ఎర్రిస్వామి తెలిపినట్లు పోలీసుల నిర్ధారణలో తెలిసింది. వర్షంలో బైక్‌పై వెళుతున్న శంకర్‌, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉండగా చిన్నటేకూరు దగ్గర బైక్‌ స్కిడ్‌ అయ్యి కిందపడ్డారని ప్రాథమికంగా తేలింది. ఈ ప్రమాదంలో శివశంకర్ రోడ్డు మధ్యలో బైక్‌తో పాటు పడిపోయాడని ఎర్రిస్వామి పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. శంకర్‌తో పాటుగా రోడ్డుకు ఇరువైపుల పడిపోయినట్టుగా ఎర్రిస్వామి వెల్లడించాడు.

ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో శంకర్‌ తలకు బలమైన గాయాలు అయ్యాయని తెలుస్తోంది. దీంతో స్పాట్‌లోనే మృతి చెందినట్లు తేలింది. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి భయంతో పారిపోయినట్టుగా పోలీసుల విచారణలో తేటతెల్లం అయ్యింది. కిందపడిన బైక్ పై నుంచి కొద్దిసేపటి తర్వాత వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుమారు 300 మీటర్ల వరకూ బైక్‌ను బస్సు ఈడ్చుకెళ్లిందని పోలీసులు నిర్ధారించారు. అయితే పూర్తి వివరాలు ఇంకా తేలాల్సి ఉంది. సీసీ ఫుటేజ్‌, సెల్‌ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఎర్రిస్వామిని పట్టుకున్న పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. పూర్తి వివరాలను ఈరోజు మీడియాకు పోలీసులు తెలిపే అవకాశముంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad