మధిర మండలంలోని మధిర, మడుపల్లి, నిదానపురం, మాటూరు, దేశినేనిపాలెం, రాయపట్నం, మోటమర్రి, చెరువులలో 396 మంది సొసైటీ సభ్యులు ఉండగా, మధిర అంబారుపేట చెరువు సొసైటీలో 220 మంది సభ్యులు ఉన్నారు. మోటమర్రి, మడుపల్లిలోని మూడు చెరువులు కలిపి 120 మంది సభ్యులు, మహాదేవపురం ఐదుగురు, నిదానపురం ఏడుగురు, మాటూరు, మాటూరుపేట 30 మంది, దేశినేనిపాలెం 32 మంది, రాయపట్నం ఐదుగురు సభ్యులు ఉండగా, ఈ చెరువులో అన్నింటికీ పులిపాటి సుబ్బారావు ప్రెసిడెంట్ కాంట్రాక్టర్ గత 25 సంవత్సరాలుగా ఏకపక్షంగా అధికారులను శాసిస్తూ ఇష్టానుసారంగా డబ్బులు కాజేసున్నా నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్న మత్స్యశాఖ అధికారులు.
మధిర అంబారుపేట చెరువులో ఈ సంవత్సరం జనవరి 22 తేదీన చెరువులోని వైరా పల్లెకారులు చేపలు పట్టించినందుకు కేజీ 20 రూపాయలు ఇచ్చినట్లు సొసైటీ సభ్యులకు చెప్పి, చివరికి పల్లెకారులు ఇచ్చింది 12 రూపాయలే మాత్రమే. మిగిలిన 8 రూపాయలను రికవరీ చేయాలని కలెక్టర్ ఆదేశించి జడ్పిటిసి సీఈఓ అప్పారావు నియమించి సంబంధిత కాంట్రాక్టర్ ప్రెసిడెంట్ వద్ద నుంచి సొసైటీ సభ్యులకు ఎనిమిది రూపాయలు రికవరీ చేయాలని నిర్ణయించారు. 8 రూపాయలను సొసైటీ సభ్యులను రికవరీ చేసిన తర్వాతనే సొసైటీ సభ్యులు చెరువులోకి దిగి చాపలు పట్టాలని మత్స్యశాఖ అధికారి ఆంజనేయుల స్వామిని, జిల్లాకలెక్టర్ ఆదేశించారు. అయినప్పటికీ అధికారిని ధిక్కరించి ఏ ఒక్క సభ్యుడు చెరువులు దిగలేదు. అప్పుడు కాంట్రాక్టర్ ప్రెసిడెంట్ వైరా నుంచి పల్లెకారులు పిలిపించి చేపలు పట్టే కార్యక్రమం నిర్వహించారు.
2005లో ఎలక్షన్లు జరిగినప్పుడు కాంట్రాక్టర్ ప్రెసిడెంట్ సుబ్బారావుకు వ్యతిరేకంగా ఉన్న 20 మంది సభ్యులను సభ్యత్వం నుండి తొలగించారు. 2022లో మరల ఎన్నికలలో సుబ్బారావు పై నాగబోయిన రామారావు ముదిరాజ్ అంబారుపేట నుంచి నామినేషన్ వేయగా, సుబ్బారావు కు ఉన్నటువంటి పలుకుబడి, ధన బలం చేత రామారావును ఓటమిపాలు చేశారు.అనునిత్యం సొసైటీ సభ్యుల బాగుకై, సమస్యలపై పోరాడుతూ ఉండేటటువంటి, రామారావును ఓడించి, తన ఏక చక్రాధిపత్యం కొనసాగిస్తున్నాడు.
సోమవారం చేపలు పట్టేందుకు వైరా పల్లెకారులను పిలిపించి చేపలు పట్టే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఏ ఒక్కరు కూడా చెరువులో దిగి చేపలు పట్టే కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈ విషయమై నాగబోయిన రామారావు అధికారులకు తెలియజేయగా సుబ్బారావు ఏకపక్ష నిర్ణయము వలన అధికారులు ఏమి చేయలేక వెనుతిరిగారు. ఇప్పటికైనా మృత్యుశాఖ ఉన్నతాధికారులు ఈ సమస్యపై పరిశీలించి సొసైటీ సభ్యులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.
Madhira: అధికారులను శాసిస్తున్న కాంట్రాక్టర్ ప్రెసిడెంట్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES