Tuesday, December 3, 2024
Homeనేరాలు-ఘోరాలుGun Fire | లవర్ తండ్రిపై కాల్పులు జరిపిన సింగ్.. ఆ కోపంతోనే!

Gun Fire | లవర్ తండ్రిపై కాల్పులు జరిపిన సింగ్.. ఆ కోపంతోనే!

హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం చెలరేగింది. ప్రేయసిని విదేశాలకు పంపాడన్న కోపంతో యువతి తండ్రిపై ఆమె ప్రియుడు గన్ ఫైర్ (Gun Fire) చేశాడు. ఘటనలో యువతి తండ్రి కంట్లోకి బులెట్ దూసుకెళ్లింది. దీంతో అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పుల ఘటన స్థానికులను భయాందోళనలకు గురి చేసింది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే… సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14 లో నివసించే యువతి (23), బల్విందర్ సింగ్ (25) అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం ఇంట్లో తెలియడంతో యువతి తండ్రి మందలించాడు. అతనికి దూరంగా ఉండాలని హెచ్చరించాడు. ఇటీవల ఆమెని ఎవరికీ తెలియకుండా విదేశాలకు పంపించాడు.

Also Read : దొంగలతో దోస్తీ చేసిన మాజీ పోలీస్ హత్య

విషయం తెలుసుకున్న బల్విందర్ సింగ్ ప్రియురాలి తండ్రిపై కోపం పెంచుకున్నాడు. వారు నివసించే అపార్టుమెంటుకి వెళ్లి యువతి కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా తనతో తెచ్చుకున్న ఎయిర్ గన్ తో యువతి తండ్రిపై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఈ గన్ ఫైర్ (Gun Fire) లో యువతి తండ్రి కంటి నుంచి బులెట్ దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే గాయపడిన యువతి తండ్రిని ఆసుపత్రికి తరలించారు. బల్విందర్ సింగ్ ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News