Wednesday, April 16, 2025
Homeనేరాలు-ఘోరాలుManakonduru: భర్త వెంటే భార్య!

Manakonduru: భర్త వెంటే భార్య!

గంటల వ్యవధిలోనే భార్య మృతి

భార్యాభర్తల బంధం మరణంలోనూ వీడకుంది.భర్త చనిపోయిన గంటల వ్యవధిలోనే భార్య కూడా కాలం చేసింది. తొలి ఏకాదశి పండుగ ఆ ఇంట విషాదం నింపింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద బంజేరుపల్లిలో ఒకే రోజు భార్యాభర్తలు చనిపోయిన ఘటన గ్రామస్థులను కంటతడి పెట్టించింది.

- Advertisement -

గ్రామానికి చెందిన తోట మల్లయ్య మంగళవారం అనారోగ్యంతో చనిపోయాడు. కాగా బుధవారం అతని అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతుండగా మృతుడి భార్య రాయలచ్చవ్వ కూడా కాలం చేసింది. తనను ఇన్నాళ్లు ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకున్న తన భర్తకు పేరుస్తున్న చితిని చూసిన భార్య రాయలచ్చవ్వ కుప్పకూలిపోయింది. పండగ పూట భార్యాభర్తలు కాలం చేయడంతో పెద్ద బంజేరుపల్లి గ్రామంలో విషాదం నింపింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బుధవారం భార్యాభర్తల అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News