Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుManchiryala: డ్రోన్, డిజె సౌండ్ నిషేధాజ్ఞలు కొనసాగింపు

Manchiryala: డ్రోన్, డిజె సౌండ్ నిషేధాజ్ఞలు కొనసాగింపు

సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల,  పెద్దపల్లి జిల్లాల జోన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలపారు,  . మద్యం సేవించి వీధుల్లో రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడటం, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించిందని, మద్యం ప్రియులు ఆగడాలకు కళ్లెం వేయడంతో పాటు ప్రజల శాంతి భద్రత పరి రక్షణ కోసం నిషేధాజ్ఞల సమయాలను పెంచడంపై నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు 2023 ఏప్రిల్ 01నుంచి మే నెల 1వ వరకు కొనసాగుతాయని తెలిపారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా  ఈ కాలపరిమితి పొడిగించబడే  అవకాశం ఉందని అన్నారు. ఐపీసీ,188,  హైదరాబాద్ నగర పోలీసు చట్టం, ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.

- Advertisement -

డీజే, డ్రోన్ లపై నిషేధాజ్ఞలు పొడగింపు..

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల జోన్ లలో డీజే సౌండ్స్ ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు పొడగించమని  అని సిపి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. చిన్నపిల్లలు వృద్ధులు రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి  భంగం కలగకుండా, శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్ లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించారు. వివిధ కార్యక్రమాల సందర్బంగా ప్రజల సమీకరణ, ప్రదర్శనల కోసం డీజే సౌండ్ల్ వినియోగిస్తున్నారని అయితే వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్  వినియోగం తప్పనిసరి అని అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపిల అనుమతులను తప్పకుండ పొందాలని సూచించారు. ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు ఏ స్థాయిలో మైక్ సెట్ లో వినియోగించాలో ఉన్నాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News