Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుManchiryala: నకిలీ విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్

Manchiryala: నకిలీ విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్

రాష్ట్రంలో రైతుల కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ రుణాలు వంటి సంక్షేమ పథకాల అందిస్తున్నారని, ఈ తరుణంలో రైతులు నకిలీ విత్తన ముఠాల బారిన పడకుండా చూడాల్సిన అవసరం సంబంధిత శాఖల అధికారులకు ఉందని, నకిలీ విత్తనాలు, మద్యం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు అప్రమత్తతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరిస్తున్నారు. వానాకాలం పంటలు సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు దళరులు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని అరికట్టడంలో భాగంగా వ్యవసాయశాఖ, ఇంటెలి జెన్స్ సిబ్బందితో కలిసి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల, పెద్ధపల్లి జిల్లలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిని గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమాచారం సేకరించి చట్టప్రకారం వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో గల విత్తన, ఎరువుల దుకాణాలను, గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీలు, అనుమానం వచ్చిన విత్తనాల శాంపిల్స్ వెంటనే పరీక్షలకు పంపించడం, రవాణా వాహనాలను కూడా ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది. లైసెన్స్ లు లేకుండా వ్యాపారం చేసే వారిపై నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాల జారీ చేయడం జరిగింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలనుంచి విత్తనాలను వినియోగించేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నకిలీ విత్తనాలు, మద్యం ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అక్రమంగా తరలిస్తున్న మద్యంను అరికట్టేందుకు పోలీసు, ఎక్సైజ్ శాఖ, రైల్వే, రవాణా శాఖ సంయుక్తంగా, సమన్వయంతో జిల్లాల సరిహద్దుల్లో నిఘా పెంచడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్రమ రవాణాను జరిగే ప్రాంతాలు, మార్గాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు మద్యం అక్రమ రవాణాను నిరోధించేందుకు ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది. 2021, 2022, 2023 సంవత్సరం ఇప్పటివరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2021 సంవత్సరంలో 65 కేసులు 158 మంది పై నమోదు, సిజ్ చేసిన నకిలీ విత్తనాలు 5,083.47 కిలోలు వాటి విలువ 9592141 రూపాయలు. 2022 సంవత్సరంలో 13 కేసులు 27 మంది పై నమోదు, సిజ్ చేసిన నకిలీ విత్తనాలు 1,483.00 కిలోలు వాటి విలువ 27,97,000 రూపాయలు ఉంటుంది. 2023 సంవత్సరంలో 2 కేసులు 9 మంది పై నమోదు, సిజ్ చేసిన నకిలీ విత్తనాలు 1,310.00 కిలోలు వాటి విలువ 26,20,000 రూపాయలు. ఇప్పటివరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల రవాణా, వ్యాపారం చేసే 18 మందిపై పిడి యాక్ట్ అమలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News