Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుMaos killed CAF Commander: సీఏఎఫ్ కమాండర్ ను నరికి చంపిన మావోయిస్టులు

Maos killed CAF Commander: సీఏఎఫ్ కమాండర్ ను నరికి చంపిన మావోయిస్టులు

మావోయిస్టుల కోసం భారీ ఎత్తున గాలింపు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాను ఆనుకుని ఉన్న చత్తీస్గడ్ దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల దుశ్చర్యకు సిఏఎఫ్ కమాండర్ ఆదివారం మృతి చెందాడు. బీజాపూర్ జిల్లా కుట్ర అటవీ ప్రాంతంలో దర్గా క్యాంపునకు చెందిన బలగాలు ఆదివారం ఉదయం సంతకు వెళ్ళాయి. అక్కడ నిత్యవసర వస్తువులు కొనుగోలు చేస్తున్న క్రమంలో సిఏఎఫ్ కమాండర్ తేజవ్ రాం భూర్యను మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు. ఈ సంఘటన మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య పోరు ప్రచ్ఛన్న యుద్దాన్ని మరిపిస్తోంది. తాజాగా సీఏఎఫ్ కమాండర్ ను మావోయిస్టులు గొడ్డలితో నరికి చంపిన ఘటన సంచలనంగా మారింది. చత్తీస్ గడ్ ప్రభుత్వం శాంతి చర్చల ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నామని తమ డిమాండ్లకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించిన క్రమంలో కమాండర్ హత్య జరగడం గమనార్హం. మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. క్యాంపులో ఉన్న పోలీసు బలగాలు ఊర్లలోకి వచ్చినప్పుడు వారిపై దాడులు చేసేందుకు స్పెషల్ గా యాక్షన్ టీమ్స్ ను రంగంలోకి దింపినట్టుగా పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి యాక్షన్ టీమ్ దాడి జరిపిన నేపథ్యంలో బీజాపూర్ జిల్లాలోని ప్రాబల్య ప్రాంతాల్లో బలగాలను అప్రమత్తం చేశారు. కమాండర్ ను చంపిన వారి కోసం కూడా కుట్రు ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News