Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుStudent Raped: ఎంబీబీఎస్ విద్యార్థినిపై స్నేహితుడి అత్యాచారం.. డ్రగ్స్ ఇచ్చి, అశ్లీల వీడియోల చిత్రీకరణ

Student Raped: ఎంబీబీఎస్ విద్యార్థినిపై స్నేహితుడి అత్యాచారం.. డ్రగ్స్ ఇచ్చి, అశ్లీల వీడియోల చిత్రీకరణ

MBBS Student Alleges ‘Friend’ Drugged, Raped Her: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థిని తన స్నేహితుడిపై అత్యాచారం ఆరోపణలు చేసింది. ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో 20 ఏళ్ల యువకుడు తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన సెప్టెంబర్ 9న జరిగినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

ALSO READ: Mount Everest: ఎవరెస్ట్‌పై తుపాను బీభత్సం.. చిక్కుకుపోయిన 1000 మంది పర్వతారోహకులు!

బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు – ఆమెతో పాటు వైద్య విద్య చదువుతున్న సహవిద్యార్థి – స్నేహం పేరుతో ఆమెను ‘హోటల్ ఆపిల్’కు రప్పించాడు. హోటల్‌కు చేరుకున్న తర్వాత, నిందితుడు ఆమెకు మత్తుమందు ఇచ్చి, ఆపై లైంగికంగా దాడి చేశాడని ఆరోపించింది. ఈ నేరానికి పాల్పడుతున్న సమయంలో నిందితుడు అశ్లీల చిత్రాలు, వీడియోలు కూడా తీశాడని, వాటిని వైరల్ చేస్తానని బెదిరించాడని బాధితురాలు తెలిపింది.

ALSO READ: Child Assault: మియాపూర్ లో దారుణం: ప్రియుడితో కలిసి ఐదేళ్ల చిన్నారిని చితకబాదిన తల్లి

బాధితురాలు హర్యానాలోని జింద్ నివాసి. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని రోహిణిలో ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని వెల్లడించారు.

ALSO READ: Visakhapatnam kancherapalem Theft : విశాఖలో దొంగల బీభత్సం.. ఇంట్లో చొరబడి 12 తులాల బంగారం, నగదు చోరి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad