కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. గత రాత్రి ఒంటిగంట సమయంలో ఆర్ఎంసి బాయ్స్ హాస్టల్ లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న రావూరి సాయిరాం ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
- Advertisement -
ఇది గమనించిన విద్యార్థులు తక్షణమే సిబ్బంది తెలియజేసి స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు హుటాహుటిన తీసుకువెళ్లారు. తీసుకెళ్లే సమయానికి విద్యార్థి మృతి చెందినట్లు హాస్పిటల్ సిబ్బంది ధ్రువీకరించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు విద్యార్థి ఎందుకు హ్యాంగింగ్ చేసుకున్నారని కోణంలో విచారిస్తున్న పోలీసులు.