సంతోషంగా తల్లి కూతురు మాట్లాడుకుంటూ బైకులో రోడ్డు క్రాస్ చేస్తుండగా మృతువు లారీ రూపంలో వచ్చి తీసుకెళ్లింది. వీరి వాహనం ఎక్కడో పడిపోయింది. వీరి మృతదేహలు లారీ టైర్ల కింద పడి తలభాగం చిద్రమైపోయింది. ఇంతటి ఘోర విషాదం చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు నగరంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తల్లి కూతురు స్పాటులోనే దుర్మరణం చెందారు. గుంటూరు గోరంట్ల చిల్లిస్ రెస్టారెంట్ వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
రోడ్డు క్రాస్ చేస్తున్న వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో సంఘటన స్థలంలోనే తల్లి కూతురు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
మృతులు వింజమూరు నాగలక్ష్మి-38 కుమార్తె- వింజమూరి శరణ్య- 14లుగా గుర్తించారు. వీరు గుంటూరు అడవి తక్కేలా పాడు టిడ్కో అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి శవగారానికి తరలించారు.