Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుMulugu: కృష్ణాపురం అంగన్వాడీ బిల్డింగ్ పరిస్థితి

Mulugu: కృష్ణాపురం అంగన్వాడీ బిల్డింగ్ పరిస్థితి

బైట చూస్తే మెరుపు లోన చూస్తే అంతా జలమయం

ములుగు జిల్లా వాజేడు మండలం కృష్ణాపురం గ్రామపంచాయతీలో గల అంగన్వాడి బిల్లింగ్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. చూడటానికి క్రొత్త బిల్డింగ్ కానీ లోనకి వెళితే తెలుస్తుంది బండారం, అందుకే దానిని పైన పటారం లోన లోటారం అంతా జలమయం. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పైన స్లాబ్ నుండి నీళ్లు క్రిందకి జలపాతం లాగా జాలువారుతున్నాయి. చూడటానికి క్రొత్త బిల్డింగ్ లాగా ఉన్నా లోనికి వెళ్తే తెలుస్తుంది అసలు స్థితి. కాంట్రాక్టర్ తుతు మాత్రంగా చేసి కట్టి వారికి అప్ప చెప్పి వెళ్తున్నారు. అది ఎలా వేశారు బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉందా లేదా అనే విషయలు సంబంధిత డిపార్ట్ మెంట్ అడిగి తెలుసుకోవాలి కానీ ముడుపులందిస్తే సైలెంట్ అయిపోయి మీఇష్టం అని చూస్తుంటారు. ఉంటే ఉంటుంది అని కూడా చూసే పరిస్థితి లేకపోయింది. దీని వలన అంగన్వాడి కేంద్రంలోని చదువుకునే చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. దీన్ని విషయం సంబంధిత అధికారులకు తెలియపరిచిన పట్టి పట్టనట్టు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారని వాపోతున్నారు.

- Advertisement -

ఈ పరిస్థితి గురించి గ్రామ సర్పంచ్ నాగ చంద్ర కి తెలియజేయగ తమ వంతుగా ఒక బరకం (తార్పలిన్) కొని బిల్డింగ్ మీద వేయించారు. అది కొన్ని రోజు పనిచేసింది. మళ్ళీ యదాస్థితిలో వర్షం కురుస్తుంది, ఇలా అయితే సీజనల్ గా వచ్చే వ్యాధులకు గురి అయ్యే పరిస్థితి వాటిల్లుతుందని అంటున్నారు. దీనికి పరిష్కారంగా బిల్డింగ్ పైన మరమ్మతులు చేస్తారా.. వేరే బిల్డింగ్ కడతరనేది అలాగే పిల్లల్ని వేరే చోటికి మారుస్తారని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఇలానే ఉంటే భారీ వర్షాలకి బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి పరిష్కార మార్గం చూపించాలని సంబంధిత అధికారులను పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు కోరుతున్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News