Thursday, November 21, 2024
Homeనేషనల్హిందూ ప్రేయసిని నరికి చంపిన బంగ్లా ముస్లిం యువకుడు

హిందూ ప్రేయసిని నరికి చంపిన బంగ్లా ముస్లిం యువకుడు

దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధ వాకర్ దారుణ హత్య ఘటన మరువక ముందే.. బంగ్లాదేశ్ లో మరో ఘటన జరిగింది. ఒక అమ్మాయితో లివ్ ఇన్ లో ఉండగానే.. మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. ఆమెను దారుణంగా నరికి చంపేశాడు. బాధితురాలు భారతీయురాలు కావడం సంచలనం రేపింది. నవంబర్ 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బంగ్లా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అబు బకర్ అనే వ్యక్తి – సప్నా అనే యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో అబు బకర్ కు కవితా రాణి అనే మరో భారతీయ హిందూ యువతి పరిచయమైంది. ఆమెతో కూడా సన్నిహితంగా ఉంటున్నాడు అబు.

- Advertisement -

నవంబర్ 5వ తేదీ సప్న పనికోసం బయటికి వెళ్లగానే.. కవితా రాణిని తన ఇంటికి రమ్మని పిలిచాడు. సరేనని వెళ్లింది కవిత. అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన అబు బకర్ సమీపంలో ఉన్న కత్తితో కవిత గొంతు కోసి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె తల, చేతులు నరికేశాడు. చేతుల్ని డ్రైనేజీలో పడేసి, తలను పాలిథిన్ కవర్లో చుట్టాడు. మొండేన్ని ఓ పెట్టెలో పెట్టి ఉంచాడు. పనికోసం బయటికి వెళ్లిన సప్న ఇంటికి వచ్చాక జరిగిందంతా చెప్పాడు. ఇద్దరూ కలిసి బంగ్లా రాజధాని ఢాకా కు పరారయ్యారు. మర్నాడు అబు బకర్ ను పనిలోకి తీసుకెళ్లేందుకు యజమాని ఫోన చేశాడు. అతని నుండి ఎలాంటి స్పందన లేదు.

అబు బకర్ ను తీసుకురమ్మని ఓ వ్యక్తిని ఇంటికి పంపాడు. అక్కడ ఇంటికి తాళం వేసి ఉండటంతో.. అతను యజమానికి చెప్పాడు. ఇదంతా అనుమానాస్పదంగా ఉందని భావించిన యజమాని.. పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు తాళం పగలగొట్టి లోపలికెళ్లి చూడగా.. కవితారాణి మొండెం కనిపించింది. మొండెం, తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి అబు-సప్నల కోసం వెతికారు. వారిద్దరూ ఢాకాలో ఉన్నారని తెలుసుకుని అక్కడ అదుపులోకి తీసుకుని.. విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News