నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలో కొందరు వ్యక్తులు నకిలీ పాస్ బుక్కులు, పత్రాలు సృష్టించి, నకిలీ రిజిస్ట్రేషన్లు, గ్రామ మ్యాప్లో లేని వ్యవసాయ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి అవే తప్పుడు పత్రాలతో ఇతరులకు అమ్మించిన 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా ఎస్పి రఘువీరా రెడ్డి ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డిఎస్పీ వెంటక రామయ్య సహాయంతో, ఆళ్లగడ్డ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి మరియు చాగలమర్రి ఎస్ఐ టి.నరసింహులు, గ్రామ మాప్ లో లేని వ్యవసాయ భూమికి నకిలీ పత్రాలు, నకిలీ పాస్ పుస్తకాలు, నకిలీ ఎలక్రనిక్ పత్రాలు సృస్టించి, వాటితో బ్యాంక్ లోన్ లు సంపాదించటం, ప్రభుత్వ పథకాలు కాజేసి, అమాయకులైన మరొకరికి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసే ముఠా సభ్యుల అరెస్టు చేశారు. డాలు అరుణ్ కుమార్ అనే వ్యక్తి చాగలమర్రి తాహసిల్దార్ ఆఫీస్ లో పనిచేయు రెవిన్యూ అధికారులతో కుమ్మక్కై సత్తివీడు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 3-1ఏ సర్వే నంబర్ను ఆ సర్వే నెంబర్ లేకపోయినప్పటికి కొత్త పత్రములు సృష్టించాడు.
సర్వే నంబర్లు ఏడు మందికి ఆన్లైన్లో పొందుపరిచి ఆ డాక్యుమెంట్లను తీసుకొని వివిధ బ్యాంకులలో మరియు ప్రభుత్వ పథకాలు అయినా రైతు రుణమును తీసుకొని ప్రజాధనం లూటీ చేయడం జరిగింది. సదరు రైతులలో ఇద్దరు రైతుల అనగాడాలు నరసింహులు సుమారు 4.12 సెంట్ల భూమిని ఆలమూరు గ్రామస్తుడైన దేవదాసుకు అమ్మాడు. ఇంకొక రైతు పుష్పరాజ్ సుమారు 4.18 సెంట్లు భూమిని పది లక్షల రూపాయల బాకీకి గాను సదరు భూమిని రిజిస్ట్రేషన్ చేయించండు. తరువాత దర్యాప్తులో భాగంగా శేటీవీడు గ్రామ పరిది మాప్ లో లేని కొత్త సర్వేనెంబర్ 3-1 ఏ సృష్టిoచి, అందులో ఏడుగురి పేరు మీద సుమారు 29ఎకరాల లేని భూమిని రూ.40,000/- తీసుకొని ఆన్లైన్ చేయించిన అప్పటి శెట్టివీడు గ్రామ విఅర్ఓ కలమల్ల హుస్సేన్ సాబ్, కంప్యూటర్ ఆపరేటర్ తలారి తిప్పనపల్లె మధు అరుణ్ కుమార్ వద్ద రూ.30,000/- తీసుకొని వాటిని డిజిటల్ సంతకం చేయించిన హరి హరనాథ్ రావు, కంప్యూటర్ ఆపరేటర్ రాము రూ.18000/- తీసుకొని పాస్ బుక్ లు ఇచ్చిన తలారి శ్రీనివాస రావు మరియు దీనియంతటికి సహకరించిన అప్పటి ముత్యాలపాడుకు చెందిన దావీదు, తలారి ప్రతాప్ లను 07.06.2023 సాయంత్రం 05.30 గంటలప్పుడు ముత్యాలపాడు బస్ స్టాండ్ వద్ద అరెస్ట్ చేశామన్నారు.