Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుMosque Attack : మసీదులో కాల్పులు, 12 మంది మృతి, పలువురు కిడ్నాప్

Mosque Attack : మసీదులో కాల్పులు, 12 మంది మృతి, పలువురు కిడ్నాప్

నైజీరియాలో బంధిపోట్లుగా పిలవబడే దుండగులు రెచ్చిపోయారు. ఓ మసీదులో వారి తుపాకులు గర్జించాయి. ఈ కాల్పుల్లో 12 మంది మరణించగా.. మరికొందరిని కిడ్నాప్ చేశారు. అక్కడ బందిపోట్లుగా పిలిచే సాయుధ ముఠాలు తరచూ ప్రజలపై దాడిచేయడం, చంపేయడం, ఎత్తుకుపోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఆదివారం (డిసెంబర్ 4,2022) అధ్యక్షుడు ముహమ్మదు బుహారి సొంత రాష్ట్రమైన కట్సినాలోని ఓ మసీదుపై విరుచుకుపడి 12మందిని పొట్టనపెట్టుకున్నారు. అంతటితో రక్తదాహం తీరక.. పలువురిని బందీలుగా తీసుకెళ్లారు.

- Advertisement -

మైగమ్‌జీ మసీదు వద్దకు మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు ఒక్కసారిగా లోపల ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు ప్రారంభించారు. దీంతో కొందరు బయటకు పరుగులు తీశారు. రాత్రి ప్రార్థనలకు వచ్చిన వారిలో మసీదు ప్రధాన ఇమామ్ తో సహా 12 మంది దుండగుల తూటాలకు బలయ్యారు. ఆ తర్వాత అక్కడున్న వారందరినీ ఒక్క చోట చేర్చిన దుండగులు వాళ్లని బందీలుగా ఎత్తుకెళ్లారు. కట్సినా స్టేట్ పోలీస్ అధికార ప్రతినిధి గంబో ఇసా ఈ ఘటనను నిర్ధారించారు. స్థానికుల సాయంతో కిడ్నాప్‌కు గురైన వారిలో కొందరిని రక్షించినట్లు వాళ్లు తెలిపారు.

కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి ప్రజల్ని దోచుకోవడమే కాకుండా.. ‘ప్రొటెక్షన్ ఫీ’ పేరుతో..అక్కడి రైతులు పంటలు పండించుకోవాలన్నా, వాటిని రక్షించుకోవాలన్నా ఈ ముఠాలకు పన్ను చెల్లించాల్సిందే. లేకపోతే ప్రాణాలు తీయడానికైనా వెనుకాడరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News