Saturday, July 27, 2024
Homeనేరాలు-ఘోరాలుPeddakadaburu: అగ్నిప్రమాదంలో ఐదు గడ్డివాములు దగ్ధం

Peddakadaburu: అగ్నిప్రమాదంలో ఐదు గడ్డివాములు దగ్ధం

లక్ష రూపాయల ఆస్తి నష్టం

మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామ శివారుల్లోని బనవాసి రహదారి సమీపంలో వంక వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు గడ్డివాములు దగ్ధమయ్యాయి. దీంతో లక్ష రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. వంక సమీపంలో రైతులు దుర్గన్న ( ఉల్లిద్ర ) మేషేక్, డేవిడ్, కుమ్మరి హనుమంతు వరి గడ్డివాములు వేసుకొన్నారు. అయితే మధ్యాహ్నం గడ్డివాములకు ప్రమాద వశాత్తు నిప్పంటుకొని మంటల్లో మేషేక్, కుమ్మరి హనుమంతులకు చెందిన రెండు చొప్పున, డేవిడ్ కు చెందిన ఒకటి మొత్తం ఐదు గడ్డివాములు అగ్నికి ఆహుతి అయ్యాయి.

- Advertisement -

చుట్టుప్రక్కల వారు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినా నీటి వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఆదోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చినా అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా ఐదు గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. మూగజీవుల కోసం వేలాది రూపాయలతో కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకొన్న గడ్డివాములు అగ్నిప్రమాదంలో దగ్ధం కావడంతో బాదిత రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News