Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుPeddakadaburu: చిరుత పులి నుండి కాపాడండి

Peddakadaburu: చిరుత పులి నుండి కాపాడండి

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులు

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల పరిధిలోని గవిగట్టు గ్రామంలో గొర్రెల కాపరి చిన్న అయ్యన్న మేకల మందపై ఒక్కసారిగా చిరుత పులి దాడి చేసి చంపేసింది. అక్కడున్న గొర్రెల కాపులను కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ఒక్కసారిగా గొర్రెలు కాపులు అరవడంతో అక్కనుండి చెట్టు పొలాల్లోకి పారిపోయిందని ఆవేదన తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న జిల్లా గొర్రెల ఫెడరేషన్ డైరెక్టర్ చిన్నతుంబలం కే.పి ఎల్లప్ప గొర్రెల కాపరులు కంటికి రెప్పలా కాపాడుకునే గొర్రెల మందపై పలుమార్లు చిరుతపులి దాడి చేసిన సంబంధించిన అధికారులు ఎవరు కూడా పట్టించుకోకుండా, తెలిసి తెలియనట్లు వ్యవహరించడం చాలా బాధాకరమని గొర్రెల ఫెడరేషన్ జిల్లా డైరెక్టర్ కెపి.ఎల్లప్ప గొర్రెల కాపురుల పక్షాన ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

గొర్రెల కాపరులకు గొర్రెలే జీవన ఆధారం. గొర్రెలు, మేకలే ఆస్తి, అంతస్తుగా భావించి నిరంతరం వాటిని సంరక్షించడానికి అహర్నిశలు కష్టపడుతూ జీవనం ముందుకు సాగిస్తున్నారు. ఎంతోకాలంగా జాగ్రత్తగా చూసుకున్న గొర్రెల మంద మీద చిరుత పులులు దాడి చేస్తున్నా కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల గొర్రెల కాపరులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని, ఇకనైనా సంబంధించిన అధికారులు వెంటనే ఈ సమస్య మీద చర్యలు తీసుకోవాలని గొర్రెల కాపరులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యలను పరిష్కరించుకుంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి చిరుత పులుల నుండి మమ్ములను రక్షించండి అయ్యా.. కాపాడండి నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News