Friday, April 4, 2025
Homeనేరాలు-ఘోరాలుPeddakadaburu: నాటుసారా స్థావరాలపై దాడి, 25 లీటర్లు స్వాధీనం

Peddakadaburu: నాటుసారా స్థావరాలపై దాడి, 25 లీటర్లు స్వాధీనం

పరారైన వ్యక్తిపై కేసు నమోదు

పెద్దకడబూరు మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోనే కల్లుకుంట గ్రామంలో నాటు సారాయి తయారీ స్థావరాలపై ఎస్ఐ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. దాడుల్లో గ్రామ శివారుల్లోని కొండల్లో 400 నాటుసారా ఊటను ద్వంసం చేశారు. 25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొన్నారు. ఈ సంఘటనలో ఒక వ్యక్తి పరారైనట్లు, అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News