ఆంద్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఫిరంగిపురంలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారీ తీసింది. చిన్ని కృష్ణ అనే వ్యక్తి భూమి కబ్జా చేశాడని గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
- Advertisement -
పోలీసులు రావడాన్ని ఓ యువకుడు వీడియో తీశాడు. దాంతో పోలీసులు యువకుడిపై దాడి(Attack) చేశారు. ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులను రాళ్లు, కర్రలతో కొట్టారు. వాహనాలు ధ్వంసం చేశారు.
పోలీసులు క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళన చేశారు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం నెలకొంది. తీవ్ర ఉద్రిక్తత నెలకొనటంతో పలువురు కలుగచేసుకుని పరిస్థితిని అదుపు చేశారు.ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.