Monday, November 17, 2025
Homeనేరాలు-ఘోరాలుPregnant Teen Killed Boyfriend: గర్భిణి అయిన బాలిక దారుణం, ప్రియుడు బెదిరించిన కత్తితోనే గొంతు...

Pregnant Teen Killed Boyfriend: గర్భిణి అయిన బాలిక దారుణం, ప్రియుడు బెదిరించిన కత్తితోనే గొంతు కోసి హత్య!

Pregnant Teen Slits Boyfriend’s Throat With Knife: ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించిన కేసులో దారుణం వెలుగులోకి వచ్చింది. తనను గర్భస్రావం చేయాలని ఒత్తిడి చేయడమే కాకుండా, బెదిరించిన కత్తితోనే 16 ఏళ్ల మైనర్ బాలిక తన ప్రియుడి గొంతు కోసి హత్య చేసింది. రాయ్‌పూర్‌లోని ఓ లాడ్జిలో ఈ ఘటన జరిగింది.

- Advertisement -

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిలాస్‌పూర్ నివాసి అయిన ఆ బాలిక, తన ప్రియుడు, బీహార్‌కు చెందిన మహమ్మద్ సద్దాంను కలిసేందుకు సెప్టెంబర్ 28న రాయ్‌పూర్ వచ్చింది. అభన్‌పూర్‌లో ఇంజినీరింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సద్దాంతో కలిసి ఆమె సత్కార్ గల్లీలోని ఆవోన్ లాడ్జిలో శనివారం నుంచి ఉంటోంది.

ALSO READ: Man Kills Wife: భార్య, బావమరిదిని చంపి ఉరేసుకున్న భర్త.. కారణం తెలిస్తే షాక్!

విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. ఆ బాలిక మూడు నెలల గర్భిణి. అయితే, ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన సద్దాం, గర్భస్రావం చేయాలని తీవ్రంగా ఒత్తిడి చేశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కొద్ది రోజుల క్రితం లాడ్జి బయట జరిగిన గొడవలో సద్దాం అదే కత్తితో ఆమెను బెదిరించాడని తెలిసింది.

ALSO READ: Bajrang Dal: ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వివాదం.. 16 ఏళ్ల బజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్య!

సెప్టెంబర్ 28 రాత్రి సద్దాం లాడ్జి గదిలో నిద్రిస్తున్న సమయంలో, ఆగ్రహంతో ఊగిపోయిన ఆ బాలిక అదే పదునైన కత్తిని తీసుకుని, అతని గొంతు కోసింది. ఆ తర్వాత గదికి బయట నుంచి తాళం వేసి, సద్దాం మొబైల్‌ను తీసుకుని పారిపోయింది. తన ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు తాళం చెవిని సమీపంలోని రైల్వే ట్రాక్‌పై విసిరేసింది.

మరుసటి రోజు ఉదయం బిలాస్‌పూర్ చేరుకున్న బాలిక తన తల్లికి విషయాన్ని చెప్పి బోరున విలపించింది. వెంటనే తల్లి ఆమెను తీసుకుని కోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఆ బాలిక ఇచ్చిన సమాచారం మేరకు రాయ్‌పూర్ పోలీసులు హుటాహుటిన లాడ్జికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న సద్దాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది భావోద్వేగంతో కూడిన నేరమని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ALSO READ: Private Videos Leak: ‘ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తా’ అని బెదిరించి, మహిళ నుంచి రూ. 17 లక్షలు వసూలు!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad