Friday, April 4, 2025
Homeనేరాలు-ఘోరాలుRachakonda CP: అలాంటి వారిపై 6 నెలలు నిఘా

Rachakonda CP: అలాంటి వారిపై 6 నెలలు నిఘా

సీక్రెట్ గా మహిళా సంరక్షణ నిఘా రిజిస్టర్

మహిళలను లైంగిక వేధింపులకు, ఈవ్ టీజింగ్ వంటి వేధింపులకు గురి చేసిన కేసులలో నిందితులు, సదరు మహిళా బాధితులను లేదా ఇతర మహిళను ఎటువంటి వేధింపులకు, భయభ్రాంతులకు గురిచేయకుండా ఉండేందుకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలలో భాగంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మహిళా సంరక్షణ నిఘా రిజిస్టర్ నేరేడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీ సుధీర్ బాబు ఐపీఎస్ మాట్లాడుతూ.. మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన నిందితుల నుండి బాధితులకు తదుపరి కక్షపూరిత వేధింపులు, దాడులు వంటివి చేయకుండా ఉండేందుకు వారి ప్రవర్తన, కార్యకలాపాల మీద మహిళా సంరక్షణ నిఘా రిజిస్టర్ ద్వారా 6 నెలల పాటు ప్రత్యేక నిఘా పెడతామన్నారు. ఈ రిజిస్టర్ ద్వారా గతంలో లైంగిక నేరాలకు పాల్పడిన నేరస్తులు మళ్ళీ అలాంటి నేరాలకు, లేదా ఇతర నేరాలకు పాల్పడకుండా నిఘా పెడతామన్నారు.

- Advertisement -


సంబంధిత పోలీసు స్టేషన్ హౌస్ అధికారి లేదా సెక్టార్ ఎస్ఐల ఆధ్వర్యంలో ఈ రిజిస్టర్ రహస్యంగా నిర్వహింస్తామన కమిషనర్ పేర్కొన్నారు. బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా లేదా అవసరమైన పక్షంలో వ్యక్తిగతంగా వారికి అవసరమైన భద్రతాపరమైన తోడ్పాటు అందిస్తారని పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, షీ టీమ్స్ ద్వారా డెకాయ్ ఆపరేషన్లు, ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ వుమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, ఏసిపి వెంకటేశం ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News