సిద్ధాంతి చౌరస్తా వద్దా నిన్నరాత్రి 7:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో సిద్ధాంతి బస్తి వాసుడు జక్కుల యాదయ్య శనివారం 23-ఆగస్టు -23 ఉదయం 7 గంటలకు లిమ్స్ హాస్పిటల్ లో మరణించడం జరిగింది, ఇలా ఎంతమంది పేదల ప్రాణాలు పోగొట్టుకోవాలి, ఈ ప్రాణలు పోవడానికి బాధ్యులు ఎవరు? రాజేంద్ర నగర్ :సెప్టెంబర్ 23(తెలుగు ప్రభ) సామాన్య ప్రజలు ఇలాంటి ప్రమాదాలు జరగడం వల్ల అన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ అసంపూర్ణమైన బ్రిడ్జ్ శంషాబాద్ ప్రజలకు శాపంగా మారిందని మనమందరం గతంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు ఎంపీ రంజిత్ రెడ్డి మేము మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించి మీకు న్యాయం చేస్తా అని అందరి ముందు హామీ ఇచ్చారు, కానీ ఇప్పటివరకు మనకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు మాకు వీలు కాదు అని చేతులెత్తేయడంతో ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు.
సిద్ధాంతి బస్తీలో ఒకరి తర్వాత ఒకరు పెద్దమనుషులు రోడ్డు ప్రమాదాల వలన మరణిస్తున్నారు, చేతులు, కాళ్లు విరూగుతున్నాయి కానీ దాన్ని ఎలా పరిష్కరించాలి అన దానిమీద ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే. ప్రకాష్ గౌడ్ ఎందుకు సోయి లేదు. మన శంషాబాద్ లో ఒక చిన్న బ్రిడ్జి వేపిచ్చుకోలేని నాయకులు ఉన్నారు …!! ఏ ఒక్క నాయకునికి మన సమస్య తెలవడం లేదా ….. ఒక్క నెలలో నాలుగు ఐదులు ఆక్సిడెంట్లు అవుతున్నాయి ఎంతో మంది సిద్ధాంతి పేద ప్రజలు మరణిస్తున్నారు దానికి ఎవరు కారణం.
ప్రమాదం జరిగితే హాస్పటల్లో వైద్యం చేసుకోవడానికి డబ్బులు లేక అప్పుల పాలవుతున్నారు. నాయకులకు… అధికారులకు… విన్నపించుకునేది ఒకటే అయ్యా దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చూపించి మా బస్తీ వాసుల మరియు పేద ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా కొడుతున్నాం.