Saturday, September 21, 2024
Homeనేరాలు-ఘోరాలుRamagundam: మహిళకు అండగా రామగుండం కమిషనరేట్

Ramagundam: మహిళకు అండగా రామగుండం కమిషనరేట్

అభయ సేఫ్ ఆటో మొబైల్ అప్లికేషన్ ప్రారంభం

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పారిశ్రామిక ప్రాంతం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ కొత్త కొత్త కళాశాలలు, స్కూల్స్, పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటుతో జనాభా సంఖ్య పెరుగుతూ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఎక్కువ మంది మహిళలు, ఉద్యోగం చేసేవారు, గృహిణులు తమ తమ అవసరాలను, పనుల కోసం ఎక్కువగా ఆటోలలో ప్రయాణం చేస్తుంటారు కావున శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ముఖ్యంగా మహిళల రక్షణకై రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో మహిళలకు అత్యవసర సమయాల్లో, రాత్రి పగటిపూట ప్రయాణాల్లో ఆటోలు, క్యాబ్లో ప్రయాణించే వారు భద్రతకు భరోసా కల్పించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ మీ భద్రతే మా లక్ష్యం’ అనే నినాదంతో అభయ సేఫ్ ఆటో మొబైల్ అప్లికేషన్ ను రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్ అధికారులతో కలిసి ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ… రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు సురక్షితంగా, పూర్తి రక్షణతో ప్రయాణించేందుకు ఈ యాప్ ను ఆవిష్కరించామన్నారు. ఆపద సమయంలో అభయ్ యాప్ ను సద్వినియోగం చేసుకొని జరగబోయే ప్రమాదాలు నివారించవచ్చని, ప్రయాణ సమయాల్లో ఆకతాయిగా వ్యవహరించే డ్రైవర్ల ఆట కట్టించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనాలకు క్యూ ఆర్ తో కూడిన యూనిక్ నెంబర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఆటోలకు క్యూఆర్‌ కోడ్‌తో మహిళల భద్రతకు భరోసా కలుగుతుందని సీపీ అన్నారు. మహిళలు ఏ సమయంలోనైనా సురక్షితంగా ప్రయాణించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్రయాణికులను ఆటో డ్రైవర్లు తప్పదోవ పట్టించిన, మార్గం మళ్లించిన అసభ్యంగా ప్రవర్తించిన, మద్యం తాగి వాహనం నడిపిన, నిబంధన విరుద్ధంగా ఎక్కువ మందిని ఎక్కించుకున్న, రాష్ డ్రైవింగ్ చేసినట్లు అనిపించిన వెంటనే మీ మొబైల్ ఫోన్ లో అభయ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఆయా వాహనాల్లో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేయాలన్నారు. ప్రయాణిస్తున్న వాహనం లైవ్ లొకేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరుతుందన్నారు. వెంటనే పోలీస్ సిబ్బంది అప్రమత్తమై వాహనాన్ని ట్రేస్ చేసి దగ్గర్లో ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం ఇస్తారన్నారు. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆకతాయిల పని పడతారని, ఇలా జరగబోయే నేరాలను కట్టడి చేయడంలో ఈ అప్లికేషన్స్ కీలకంగా పనిచేస్తుందన్నారు. ఆధునిక సాంకేతిక క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల డ్రైవర్లు తప్పు చేసేందుకు సైతం భయపడతారని, ప్రయాణికులకు సైతం సురక్షితంగా గమనించి స్థానాలకు చేర్చమని నమ్మకం కలుగుతుందన్నారు.ఈ యాప్ ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల, మహిళల భద్రత విషయంలో కీలకమైన క్యూఆర్‌ కోడ్‌ను ఆటోవాలాలు పక్కాగా వినియోగించేలా చర్యల్ని తీసుకుంటామన్నారు. ఆటో నంబరుతో పాటు వాహన చోదకుడికి సంబంధించిన పూర్తి వివరాలను అనుసంధానించిన క్యూఆర్‌ కోడ్‌ను అందచేయడం జరిగిందని, ఆటోవాలాలు వాటిని తమ సీటు వెనుకభాగంలో ప్రయాణిస్తున్న వారికి కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్, మంచిర్యాల డిసిపి సుదీర్ కేకన్, అడిషనల్ డీసీపీ ఏ ఆర్ రియాజ్ హుల్ హాక్, గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాసరావు, మంచిర్యాల ఏసిపి తిరుపతిరెడ్డి, జైపూర్ ఎసిపి మోహన్, బెల్లంపల్లి ఏసిపి సదయ్య, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్ సి ఎస్ సి పి మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, ఈవో నాగమణి, ఏ ఆర్ ఏసిపిలు సుందర్ రావు, మల్లికార్జున్ ఇన్స్పెక్టర్ లు, ఆర్ఐ లు, ఎస్ఐ లు, సీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News