Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుRamagundam: ఈజీ మనీ కోసం సూడో నక్సల్స్ అవతారం..చివరికి..

Ramagundam: ఈజీ మనీ కోసం సూడో నక్సల్స్ అవతారం..చివరికి..

నక్సలైట్ అని చెప్పుకుంటూ.. ఎయిర్ గన్స్ తో ప్రజలను బెదిరించి సులువుగా అక్రమంగా డబ్బులు సంపాదించే పనిలో బిజీగా ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రామగుండా జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ… మంచిర్యాల పోలీస్ జోన్ సిసిసి సస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై రవి కుమార్ సిబ్బందితో కలిసి నస్పూర్ లోని తగ్గవాగు సమీపంలో వాహన తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు వారిని గమనించి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ద్విచక్రవాహనంపై పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు నిందితులని పట్టుకొని విచారించగా, నిందితులు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు.
ఇటిక్యాల గ్రామం మేడి వెంకటేష్ (26), పెద్దంపేట గ్రామానికి చెందిన ఆరేందుల రాజేష్ (31)గా వీరిద్దరినీ గుర్తించారు. వివరాల్లోకి వెళితే…. నిందితులు ఇద్దరు చిన్నతనం నుంచి మిత్రులు, గత కొంత కాలంగా ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈ మధ్య రియల్ ఎస్టేట్ సరిగా నడవక ఇద్దరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో వెంకటేష్, రాజేష్ సులువుగా డబ్బులు సాధించాలని ఆలోచనతో ఎవరినైనా అమాయకులని నక్సలైట్ ల పేరుతో ఫోన్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ చేశారు. గత కొన్ని రోజుల క్రితం రాజేష్ చెప్పిన ప్రకారం వెంకటేష్ హైదరాబాద్ నుంచి రెండు ఎయిర్ గన్స్ కొనుగోలు చేసి, నక్సలైట్ పేరుతో మాట్లాడానికి గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి ఫోన్, సిమ్ కార్డు కొనుగోలు చేశారు. తరువాత నస్పూర్ లో కాంతయ్య ఇంటి వద్ద రెక్కీ చేసి, గత నెల ఫిబ్రవరి 21 తేదీన రాత్రి సమయంలో రాజేష్ చెప్పిన పథకం ప్రకారం వెంకటేష్ తన పల్సర్ బండి మీద రెండు ఎయిర్ గన్స్ ని సంచిలో పెట్టుకొని వచ్చి అర్ధరాత్రి సమయంలో కాంతయ్య ఇంటి ఆవరణలో పడవేసి తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు తెల్లవారు జామున రాజేష్, వెంకటేష్ లు కలిసి కాంతయ్య, అతని కొడుకు నాగరాజులకు ఫోన్ చేసి తిర్యాణి అడవుల నుంచి నక్సలైట్స్ లమ్ మాట్లాడ్తున్నాం, మీఇంటి ముందు తుపాకులు పెట్టాం, మీరు 40లక్షలు ఇవ్వకపోతే మీకుటుంబ సభ్యులను అందరిని చంపుతామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్ కేసు నమోదు చేసి, వారి ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞాన విధానంలో దర్యాప్తు చేయగా నింధితుల ఇద్దరినీ అరెస్ట్ చేశారు. రాజేష్ మీద గతంలో మంచిర్యాల, హాజీపూర్ ఏరియాలలో పలుకేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -



సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News