ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పటం సంచలనం సృష్టిస్తోంది. ఓ మైనర్ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఎమ్మెల్యేపై నేరారోపణ రుజువు కావటంతో ఇప్పుడు ఆయన తన ఎమ్మెల్యే పదవికి అనర్హుడు కూడా అవ్వటం బీజేపీ సర్కిల్ లో షాకింగ్ న్యూస్ గా మారింది.
2014, నవంబర్ 4న ఎమ్మెల్యే ఈ దాష్టీకానికి పాల్పడగా బాధితురాలి సోదరుడు న్యాయ పోరాటం చేశాడు. కాగా తమను ఎమ్మెల్యే వేధించాడని, ఏడాదిపాటు తమను బెదిరిస్తూ కేసు విత్ డ్రా చేసుకోవాలని సతాయించాడని ఆ కుటుంబం వెల్లడించింది. దుధి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంపికైన ట్రైబల్ ఎమ్మెల్యేకు జైలు శిక్ష విధించటంతో పాటు 10 లక్షల ఫైన్ కూడా విధించిన కోర్టు ఈ మొత్తాన్ని బాధితురాలికి ఇవ్వాలని ఆదేశించింది. పోక్సో కేసు కింది ఎమ్మెల్యేపై కేసు నమోదయింది.