Wednesday, April 16, 2025
Homeనేరాలు-ఘోరాలుRoad Accident: ఒంటిమిట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Road Accident: ఒంటిమిట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. తిరుపతి వైపు నుంచి అతి వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం.. ఆర్టీసీ బస్సు, పోలీసు వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కార్పియోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను నంద్యాల హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంలో పోలీసు వాహనంలో ఉన్న కానిస్టేబుల్‌తో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News